Search
Friday 21 September 2018
  • :
  • :

చెల్లని చెక్కు ఇచ్చిన వ్యక్తికి ఏడాది జైలు

Cheque-Bounce2జగిత్యాల: చెల్లని చెక్కు ఇచ్చిన నిందితుడికి ఏడాది జైలు శి క్షతో పాటు రూ.3 లక్షల జరిమానా విధిస్తూ జగిత్యాల మొదటి శ్రేణి న్యాయ స్థానం గురువారం తీర్పు వెలువరించింది. జగిత్యాల పట్టణానికి చెందిన ము సిపట్ల లక్ష్మీనారాయణ తన మిత్రుడైన తొడుపునూరి వెంకటరమణకు 2009లో రూ. 3 లక్షలు అప్పుగా ఇవ్వగా అప్పు పత్రంగా ప్రామిసరీ నోటు రాసి ఇచ్చాడు. తాను ఇచ్చిన అప్పును చెల్లించాలని లక్ష్మీనారాయణ ఒత్తిడి చేయగా 2013లో వెంకటరమణ చెక్కు రాసి ఇచ్చాడు. అయితే ఆ చెక్కును లక్ష్మీనారాయణ బ్యాంకులో వేయగా చెక్కు బౌన్స్ అయింది. దాంతో లక్ష్మీ నారాయణ కోర్టును ఆశ్రయించగా సాక్షాధారాలను పరిశీలించిన న్యాయ మూర్తి రమేశ్ వెంకటరమణకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 3 లక్షలు చె ల్లించాలని తీర్పు చెప్పారు.

Comments

comments