Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

Man Injured In Road Accident In Nalgonda District

కట్టంగూర్‌ః 65వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని అయిటిపాముల గ్రామ శివారులో గల చెర్వుఅన్నారం స్టేజి సమీపంలో శనివారం చోటు చేసుకుంది. చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన దోరెపల్లి రాములు తన టివిఎస్ ఎక్సెల్ వాహనంపై సొంత పని నిమిత్తం నకిరేకల్‌కు బయలు దేరాడు. మార్గమద్యలోని చెర్వుఅన్నారం స్టేజి సమీపంలోకి వెళ్లగానే హైదరాబాద్ నుండి విజయవాడ వైపు అతివేగంగా ప్రయాణిస్తున్న కారు వెనుక నుండి ఢీకొట్టడంతో కాలు, చెయ్యి విరగడంతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం క్షతగాత్రున్ని 108లో నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు.

Man Injured In Road Accident In Nalgonda District