Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

టిసికి భయపడి రైలు నుంచి దూకేసిన యువకుడు

Selfie-with-Running-Train

మధిర: టికెట్టు లేకుండా ప్రయాణిస్తున్న ఓ యువకుడు టికెట్ కలెక్టర్ చెకింగ్ వస్తున్న విషయాన్ని గమనించి నడుస్తున్న రైలులో నుంచి దూకేశాడు. దీంతో యుకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన మధిర రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… బోనకల్ మండలం జానకీపురంకు చెందిన కోట నవీన్(19) విజయవాడ నుంచి బోనకల్‌కు కాజీపేట ప్యాసింజర్ రైలులో ప్రయాణిస్తున్నాడు.

రైలు మధిర స్టేషన్ దాటి వైరా నదికి సమీపిస్తుండగా టిసి చెకింగ్‌కు వచ్చాడు. దీంతో భయపడిన నవీన్ రైలు నుంచి దూకేశాడు. దాంతో బాధితుడి కుడికాలితోపాటు కుడి చేయికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే నవీన్‌ను 108లో మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Comments

comments