Search
Sunday 23 September 2018
  • :
  • :

వ్యక్తి దారుణ హత్య..

Man killed brutally In Varni Mandal

బోధన్: వర్ని మండలం పాతవర్ని గ్రామంలో షేక్ నబీ (42)అనే వ్యక్తి బుధవారం తెల్లవారుజామున దారుణ హత్య కు గురైయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ మహిళతో గత కొంతకాలం నుండి అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సదరు మహిళకు సంబంధించిన కుటుంబ సభ్యులు పలు మార్లు నబీని హెచ్చరించినట్లు తెలిసింది. మృతుడు పద్దతి మార్చుకోకపోవడంతో పక్కా పథకం ప్రకారం మాటు వేసి రాత్రి సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వచ్చిన నబీని కత్తితో గొంతు కోసి, కడుపులో పొడిచి హత్యకు పాల్పడినట్లు పోలీసుల నిర్ధారణలో తేలింది. గ్రామానికి చెందిన నడిపి వీరయ్య అనే వ్యక్తి కనిపించకుండా పోవడంతో నబీని హత్య చేసి పరారైనట్లు స్థానికులు పేర్కొంటున్నారు. పరారీలో ఉన్న వ్యక్తి కుటుంబంలోని మహిళతో నబీ స్నేహపూర్వకంగా ఉండేవాడని ఈ హత్యను వీరయ్యనే చేసి ఉంటాడని పలువురు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐసాయన్న సంఘటన స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలపై ఆరాతీశారు. వీరయ్య కోసం స్థానికుల వద్ద వాకబ్ చేసి ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. సంఘటన స్థలానికి రుద్రూర్ సిఐ శ్రీనివాస్ రెడ్డి, కోటగిరి ఎస్ఐ రాజ్ భరత్ రెడ్డిలు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని భార్య పుత్లీ బేగం ఫిర్యాదు మేరకు నడిపి వీరయ్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments