Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

బస్సు ఢీకొని వ్యక్తి మృతి…

Software-killedబాలానగర్: బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐడిపిఎల్ చౌరస్తాలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. బాలానగర్ ఎస్సై కె. వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలప్రకారం, బాల్ రెడ్డినగర్ లో నివాసముంటున్న కొల్లి.రాంబాబు(32) ఇన్‌ఫోటెక్ కంపనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి గా విధులు నిర్వర్తిస్తున్నాడు, కాగా ఉదయం 11గంటల ప్రాంతంలో ఐడిపిఎల్ చౌరస్తా మీదుగా ద్విచక్రవాహనం(ఎపి28బివి1147) పై ప్రయాణిస్తున్నాడు. చౌరస్తా వద్దకు రాగానే జీడిమెట్ల డిపోకు చెందిన బస్సు(ఎపి10జడ్8340) వేగంగా వచ్చి వెనుకనుండి డీ కోట్టడంతో తీవ్ర గాయాలపాలైన రాంబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. నిర్లక్షంగా బస్సు నడిపినందుకు డ్రైవర్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కోన్నారు.

Comments

comments