Home జాతీయ వార్తలు విజయవాడలో దారుణం…

విజయవాడలో దారుణం…

Man Killed In Vijayawada In Andrapradesh

విజయవాడ: గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వచ్చి నడిరోడ్డులో మరో వ్యక్తి పై కత్తితో దాడి చేసిన సంఘటన సోమవారం సత్యనారాయణ పురం బిఆర్ టిఎస్ రోడ్డులో చోటు చేసుకుంది.  వివరాలలోకి వెళితే.. స్ధానికుల సమాచారం మేరకు.. చదలవాడ రాజు అనే వ్యక్తి రైల్వే ఇనిస్టిట్యూట్‌లో గేట్‌ మెన్‌ ట్రైనింగ్‌ తీసుకొవడానికి నగరానికి వచ్చారు. ఈ క్రమంలో సోమవారం రోడ్డుపై వెళ్తుండగా గుర్తు తెలియని దుండగుడు  బైక్‌ మీద వచ్చి రాజుతో కాసేపు మాట్లాడాడు. అనంతరం దుండగుడు రాజును కత్తితో విచక్షణ రహితంగా పొడిచి పారి పోయాడు. తీవ్రంగా గాయపడిన రాజును స్థానికులు స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ రాజు చనిపోయాడు. రాజు బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు బైక్ ఆధారంగా పశ్చిమగోదావరి జిల్లా బాదంపూడి కి చెందిన శేఖర్ గా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో రాజు బావ మరిదే ఈ హత్య చేశాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.