Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఆస్తి కోసమే గొంతు నులిమి..

వీడిన కిర్గుల్ (బి) హత్య కేసు మిస్టరీ
నిందితుడిని పట్టుకున్న బాసర పోలీసులు

Accused

బాసర: ని ర్మల్ జిల్లా బాసర మండ లం కిర్గుల్ (బి)లో జరిగిన హత్య కేసు మిస్టరీ వీడింది. వారం రోజుల తర్వాత నిం దితుడిని బాసర పోలీసులు పట్టుకొని రిమాండ్‌కు పం పారు. ముథోల్ సిఐ రఘు పతి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లింగవ్వతో అదే గ్రామానికి చెందిన ముత్యాల రాజు తరుచూ మద్యం తాగి గొడవ పడేవాడు. ఎలాగైనా ఆమె ఆస్తిని స్వాధీనం చేసు కోవాలని ఈ నెల 23న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పథకం ప్రకారం లింగవ్వను గొంతు నులిమి హత్య చేశాడు. అయితే నిందితుడు ముత్యాల రాజు ఇటీవల తానూరులోని ఓ పెట్రోల్ బంక్‌లోనూ నగదు దోచుకెళ్లి పరారీలో ఉ న్నాడు. ఈ ఘటనపై తానూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో బాసర పోలీసులు నిందితుడిని పట్టుకొని అతడి వద్ద ఉన్న రెండు తులాల బంగారం స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు పంపినట్లు సిఐ తెలిపారు. కేసును ఛేదించిన ఐడి పార్టీ, పోలీసులను భైంసా డిఎస్‌పి రాములు అభినందించారు.

Comments

comments