Home తాజా వార్తలు నల్గొండలో దారుణం.. ప్రేమ పెళ్లి…

నల్గొండలో దారుణం.. ప్రేమ పెళ్లి…

Man killed wife and threw body into well in Nalgonda District

నల్గొండ: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని అత్యంత కిరాతకంగా చంపేసి బావిలో పడేశాడో శాడిస్ట్. అనంతరం తన ఇద్దరు పిల్లలను అమ్మేసి మరో పెళ్లి చేసుకున్నాడు. ఈ దారుణం నల్లొండ జిల్లాలో జరిగింది. తొమ్మిదేళ్ల క్రితం ఇంట్లోంచి పారిపోయి హనుమంతు, ప్రియాంక పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ప్రియాంక సోదరుడు ఉపేంద్ర ఆమె కోసం వెతుకుతున్నాడు. ఫేస్ బుక్ లో కూడా ప్రియాంక  ఆచూకీ కోసం తమ్ముడు ప్రచారం చేశాడు. మూడేళ్ల క్రితం అక్క, బావకు సంబంధించిన సమాచారం దొరకడంతో మరిన్ని ప్రయత్నాలు చేశాడు. చివరకు హనుమంతు అడ్రస్ కనుకున్నాడు ఉపేంద్ర.  కాగా, తన అక్క హత్యకు గురైనట్లు తెలిసింది. బావ హనుమంతు అక్కను చంపి బావిలో పడేయంతో పాటు ఇద్దరు పిల్లలను అమ్మేసి రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలియడంతో ఉపేంద్ర నిర్ఘాంతపోయాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు నిందితుడు హనుమంతును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హనుమంతును విచారించగా ప్రియాంకను చంపేసి మృతదేహాన్ని మర్రిగూడలో బావిలో పడేసినట్లు తెలిపాడు. పోలీసులు శుక్రవారం మర్రిగూడలో బావిలోంచి ప్రియాంక మృతదేహాన్ని వెలికితీయనున్నారు.