Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

దంపతుల మధ్య గొడవ.. భార్య గొంతు, కళ్లు, ముక్కు…

Man killed wife gum in the throat in Madhya Pradesh

భోపాల్: దంపతుల మధ్య జరిగిన చిన్న గొడవ భార్య ప్రాణాలు తీసింది. భార్యతో వాగ్వాదం ముదరడంతో విచక్షణ కోల్పోయిన భర్త ఆమె నోటితో పాటు కళ్లు, ముక్కులోకి జిగురులాంటి పదార్థాన్ని పోసి ఊపిరాడకుండా చేయడంతో చనిపోయింది. అనంతరం భర్త అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లోని విదిశాలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే… విదిశాలోని రాజ్ పుత్ కాలనీలో హల్కేరామ్ కుష్వాహా, దుర్గాబాయి దంపతులు నివాసముంటున్నారు. అయితే, వీరిద్దరి మధ్య ఆర్థిక సమస్యల కారణంగా తరచూ గొడవలు జరిగేవి.

ఈ నేపథ్యంలో శుక్రవారం మరోసారి వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉండటంతో హల్కేరామ్ వారిని బయటకు పంపించాడు. అనంతరం విరిగిపోయిన వస్తువులను అతికించేందుకు ఉపయోగించే జిగురు లాంటి పదార్థాన్ని భార్య నోరు, ముక్కు, కళ్లలోకి బలవంతంగా పోశాడు. దాంతో ఊపిరాడక ఆమె ప్రాణాలొదిలింది. భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న హల్కేరామ్ అక్కడి నుంచి పరారయ్యాడు. కొద్దిసేపటి తరువాత బయటకెళ్లిన 15 ఏళ్ల కుమారుడు తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తల్లి నిర్జీవంగా పడి ఉంది. దీంతో ఆ బాలుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. బాలుడి సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న హల్కేరామ్ కోసం చర్యలు చేపట్టారు.

Comments

comments