Search
Saturday 22 September 2018
  • :
  • :

హెలికాప్టర్‌ను హోటల్ ముందు దించిన పైలట్!

Pilot lands helicopter at hotel

సిడ్నీ: సాధరణంగా మనం లాంగ్ జర్నీ చేసేటప్పుడు మధ్యలో ఆకలి వేస్తే అందుబాటులో ఉన్నా ఏ ధాబాకో, హోటల్‌కో వెళ్లి భోజనం చేయడం కామన్. కానీ అదే హెలికాప్టర్ లేక విమానం పైలట్‌కు ఆకలి వేస్తే ఏం చేయాలి మాములుగైతే వాటిల్లోనే పైలట్‌లకు భోజనంతో పాటు అన్నీ సదుపాయాలు ఉంటాయి. లేని పక్షంలో విమానాశ్రయం, హెలిప్యాడ్ వద్ద విమానాన్ని లేక హెలికాప్టర్‌ను కిందకు దించిన తరువాత ఇతర పనులు చూడాల్సి ఉంటుంది.

అయితే ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఓ హెలికాప్టర్ పైలట్ తనకు ఆకలి వేయడంతో ఏకంగా హెలికాప్టర్‌ను హోటల్ ముందే కిందకు దించి తనకు కావాల్సిన ఫుడ్ పార్శిల్ తీసుకుని మళ్లీ వెళ్లిపోయాడు. ఇది చూసిన ఆ హోటల్ సిబ్బంది కొద్దిసేపు అలా షాక్‌లోనే ఉండిపోయింది. ఇది నిజమా కల అనే భ్రమలో ఉండిపోయారు. సదరు పైలట్ వెళ్తూ.. వెళ్తూ.. తను ఆ హోటల్‌కు వచ్చినట్లు తన హెలికాప్టర్‌తో ఓ సెల్ఫీ కూడా తీసుకుని వెళ్లాడు. కాగా ఈ తతాంగాన్ని అక్కడి వారు వీడియో తీసి అంతర్జాలంలో పెట్టడంతో వైరల్ అయింది. అయితే ఈ వీడియో కాస్తా ఏవియేషన్ అధికారుల కంటపడటంతో ఈ ఘటనపై త్వరలో విచారణ చేపడతామని వెల్లడించినట్లు తెలుస్తోంది.

Comments

comments