Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

కోబ్రాతో సెల్ఫీ.. ప్రాణాలు తీసింది! (వీడియో)

Selfie-Cobra

స్మార్ట్‌ఫోన్లు వచ్చాక కొందరు కొండ చివరనా, కొందరు రైల్వే ట్రాక్‌పై, మరికొందరు విష జంతువులతో ఇలా రకరకాలుగా సెల్ఫీలు దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా కూడా అజాగ్రత్తగా సెల్ఫీలు దిగే వారి సంఖ్య రోజురోజుకు పెరిపోతుంది. తాజాగా ఓ వ్యక్తి నాగుపాముతో సెల్ఫీ దిగాలని ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తుంది.
బాబురామ్ జాఖర్ అనే వ్యక్తి ఆ ఆలయం సమీపంలో పాముతో సెల్ఫీ దిగాలనుకున్నాడు. ఓ వ్యక్తి పాముని పట్టుకోని తన మెడలో వేస్తుండగా.. ఫోటో దిగుదామనుకున్నాడు. సరిగ్గా పాము మెడ దగ్గరికి రాగానే బాబురామ్ తలపై కాటేసింది. ఈ తతంగమంతా మరో వ్యక్తి వీడియో తీశాడు. అయితే పాము కాటును ముందు పట్టించుకోని బాబురామ్ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అక్కడున్నవారు అతన్ని హుటాహుటిగా ఆస్పత్రికి తరలించకుండా మూఢనమ్మకంతో దగ్గర్లోని ఆలయానికి తరలించారు. పరిస్థితి మరింత విషమించడంతో అప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

Comments

comments