Search
Saturday 22 September 2018
  • :
  • :

వ్యక్తిని ఢీకొట్టిన రేవంత్‌రెడ్డి కారు…

Four, Policemen, Were, Injured, Road Accident,Telangana news,Telugu news,Road Accident news in Telugu,Road Accident news Today in Telugu,Road accident news in Hyderabad,Road Accident News in Outer Ring Road,Road Accident in India in Telugu

వనపర్తి: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కారు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి కాళ్లు విరిగిన ఘటన వనపర్తి జిల్లాలోని మూసాపేట వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వనపర్తిలో సింహగర్జనకు రేవంత్ కారులో బల్దేరారు. అయితే కారు మూసాపేట వద్దకు రాగానే ఓ వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితుడి రెండు కాళ్లు విరిగిపోయినట్లు తెలిసింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. దీంతో రేవంత్ కారు ముందు స్థానికులు ధర్నాకు దిగారు. బాధితుడికి న్యాయం చేయాలని రేవంత్‌ను నిలదీశారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించి రేవంత్‌ను అక్కడి నుంచి పంపించి వేశారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments