Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

సెక్స్‌కు నో చెప్పిందని భార్యపై యాసిడ్ దాడి!

Acid-Attack-Victim

లక్నో: శృంగారానికి అంగీకరించలేదని భార్య మర్మాంగాలపై యాసిడ్ దాడి చేశాడో శాడిస్టు భర్త. ఈ దారుణ ఘటన యుపిలోని కన్నౌజా ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… స్థానిక కొత్వాలి జిల్లా బెహ్రిన్ ప్రాంతానికి చెందిన మహిళకు ఆరేళ్ల క్రితం ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఇటీవల భార్యభర్తాల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తనతో శృంగారంలో పాల్గొనాలని భార్యను బలవంతం చేయబోయాడు భర్త. దానికి భార్య అంగీకరించలేదు. దీంతో అతడు ఆగ్రహానికి గురయ్యాడు. ఎలాగైనా భార్యపై కసి తీర్చుకోవాలని నిద్రిస్తున్న సమయంలో ఆమె జననాంగాలపై యాసిడ్ పోసి అక్కడి నుంచి పరారయ్యాడు. యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు గట్టిగా అరవడంతో చుట్టూపక్కలవారు వచ్చి చూశారు. ఆ సమయంలో బాధితురాలు కాలినగాయాలతో విలవిలాడుతుంది. దీంతో వెంటనే ఆమెను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు ఆస్పత్రికి వచ్చిన పోలీసులు… బాధితురాలి ఫిర్యాదుతో భర్తపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

comments