Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

పదేళ్ల బాలికపై అఘాయిత్యం.. హత్య…

Man raped 10 Year old Girl in Nirmal District

నిర్మల్: పదేళ్ల బాలికపై ఓ మృగాడు అఘాయిత్యానికి పాల్పడి ఆపై హత్య చేసిన దారుణ ఘటన నిర్మల్ జిల్లాలోని కూచనపల్లిలో చోటుచేసుకుంది. ఇంటిముందు ఆడుకుంటున్న బాలికను నిందితుడు ప్రవీణ్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం బాలిక ఎక్కడ బయటపెడుతుందోనని భయపడి హతమార్చాడు. అయితే, గోదావరి నది ఒడ్డున బాలిక మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Comments

comments