Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

మధ్యప్రదేశ్‌లో దారుణం…

Child-Rape-Abuse

భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ నీచుడు అభంశుభం తెలియని నాలుగేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని కప్పిపుచ్చడానికి బాలిక తలపై బండరాయితో మోది చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని అడవిలో పాతిపెట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 325 దూరంలోని మనవర్‌లో నివాసముండే కరణ్(25) పక్కంటిలో ఉండే 4 ఏళ్ల బాలికను మాయమాటలు చెప్పి దగ్గరలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని బాలికప తలపై రాయితో మోది చంపేసి, పక్కనే ఉన్న అడవిలో పాతిపెట్టాడు. అయితే బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కరణ్‌ను అదుపులో తీసుకుని విచారించగా జరిగిన విషయం చెప్పాడు. అతడి సమాచారం మేరకు అటవీప్రాంతానికి వెళ్లి బాలిక మృతదేహాన్ని బయటకుతీశారు పోలీసులు. ఆ తరువాత పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కరణ్ పై అత్యాచారం, హత్య కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి విరేంద్ర సింగ్ తెలిపారు.

Man rapes 4-yr-old girl and crushes head with stone in MP.

Comments

comments