Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

కోడలి పై అత్యాచారం చేసిన మామ..

Man rapes daughter in law

భోపాల్: ఇంట్లో ఒంటరిగా ఉన్న కోడలి పై మామ అత్యాచారానికి పాల్పడిన సంఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో గల శ్యామ్ల హిల్స్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పై 30ఏళ్ల వివాహిత ఫిర్యదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏప్రిల్‌లో మానసిక సమస్యతో ఇబ్బంది పడుతున్ననిందితుడి కొడుకుతో బాధిత మహిళకు వివాహమైంది. తన భర్త మెంటల్‌గా అన్‌ఫిట్ అనే విషయాన్ని పెళ్లి జరిగిన కొద్ది రోజులకు ఆమెకు తెలిసింది. వివాహం జరిగిన 10 రోజుల తరువాత ఒక రోజు కోడలు నిద్రిస్తున్న గదిలోకి వచ్చి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడని పోలీస్‌లకు ఆమె ఫిర్యాదు చేసిందని వారు చెప్పారు. కొన్ని నెలలుగా పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని నిందితుడు భయపెట్టినట్లు ఆమె అన్నారు.

Comments

comments