Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

చనిపోయాడనుకుంటే బతికొచ్చాడు..!

Died-man-returns-to-home

నెల్లూరు: చనిపోయాడని అంత్యక్రియలు నిర్వహించిన తరువాత కొన్ని రోజులకు అదే వ్యక్తి కుటుంబ సభ్యులకు ఎదురుపడితే ఎలా ఉంటుంది. కుటుంబీకుల ఆనందానికి అవధుల్లుండవు కదా. ఇదే కొవలోని ఓ ఘటన ఎపిలోని నెల్లూరు జిల్లా సైదాపురుం మండంలోని పొక్కందల గ్రామంలో చోటుచేసుకుంది. చనిపోయింది తమ కొడుకేనని భావించి ఆ తల్లిదండ్రులు అంత్యక్రియలు చేశారు. కాని 16 రోజుల తర్వాత విచిత్ర ఘటన జరిగింది. కొడుకును పొగొట్టుకుని దుఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు అతడు బతికే ఉన్నాడని తెలిసింది. దాంతో ఆ కుటుంబానికి ఒక్కసారిగా ప్రాణం లేచివచ్చింది.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే… స్థానికంగా ఉండే పుల్లయ్య, పద్మమ్మ దంపతుల చిన్నకొడుకు మురళి(29) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మురళికి పెళ్లై కూతురు ఉంది. అయితే సరిగ్గా నెల రోజు కిందట పని మీద అని ఇంటి నంపచి వెళ్లిన మురళి ఆచూకీ లేకుండా పోయాడు. దాంతో కుటుంబ సభ్యులు చాలా చోట్ల వెతికారు. కాని ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో గత నెల 25న సైదాపపురం అటవీ ప్రాంతంలోని పల్లెమిట్ట గని గుంతలో గుర్తుతెలియని యువకుడి శవం దొరికింది. దీంతో పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిర్వహించారు. ఈ విషయం తెలిసిన మురళి కుటుంబీకులు ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు.

మురళి శరీరంపై ఉన్న గుర్తులు మృతదేహంపై ఉన్న గుర్తులతో సరిపోవడంతో వారు చనిపోయింది తమ కొడుకేనని ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే శనివారం రావూరుకు కూల్ డ్రింక్స్ లోడు లారీ వచ్చింది. ఆ లారీ డ్రైవ్ చేస్తుంది ఎవరో కాదు మురళియే. అది గమనించిన అతడి బంధువులు వెంటనే ఫోటో తీసి మురళి కుటుంబ సభ్యులకు పంపారు. ఆ ఫోటో చూసిన మురళి తల్లిదండ్రులు వెంటనే రావూరుకు చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ లారీ వేరే చోటికి వెళ్లడంతో అక్కడికి వెళ్లి మురళిని కలుసుకుని ఇంటికి తీసుకువచ్చారు. దీంతో చనిపోయాడనుకున్న మురళి తిరిగి వచ్చేసరికి ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.

Comments

comments