Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

ప్రాణం తీసిన సెల్‌ఫోన్ డ్రైవింగ్..!(వీడియో)

Man riding a two-wheeler crashed into another two-wheeler in Hyderabad

హైదారబాద్: సెల్‌ఫోన్ మాట్లాడుతూ, నిర్లక్ష్యపు రాంగ్‌రూట్ డ్రైవ్ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఈ ఘటన నగరంలోని పాతబస్తీలో చోటు చేసుకుంది. 35 ఏళ్ల ఖాజా అనే వ్యక్తి తన ద్విచక్రవాహనంపై ఫోన్‌లో మాట్లాడుతూ, రాంగ్ రూట్‌లో రోడ్డు దాటేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అటువైపు నుంచి వచ్చిన మరో ద్విచక్రవాహనం ఖాజా బైక్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఖాజా తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సిసిటివి కెమెరాల్లో రికార్డయ్యాయి. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, రాంగ్‌రూట్ డ్రైవింగ్ చేయరాదని ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు చెప్పిన వాహనాదారులు మాత్రం పెడచెవిన పెడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటనే దీనికి నిదర్శనం.

Comments

comments