Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

కోరిక తీర్చాలంటూ పిన్నికి యువకుడి వేధింపులు!

RAPE

హైదరాబాద్: వావివరసలు మరిచిపోయి కామాంధులు మృగంలా ప్రవర్తిస్తున్న ఘటనలు తరచూ వార్తలో వస్తున్నాయి. సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఒకటి తాజాగా హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఫిలింనగర్‌లో నివాసం ఉండే ఓ గృహిణి కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుంది. అయితే, ఆమె  చెల్లెలి కొడుకే  ఆమె పట్ల పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించాడు. పిన్ని అవుతుందనే విషయాన్ని కూడా మరిచిపోయి ఆ మృగం తన కోరిక తీర్చాలంటూ ఆమె వెంట పడుతున్నాడు. చాలా రోజులుగా ఆ కామాంధుడు ఇలాగే చేస్తుండటంతో విసుగెత్తిపోయిన బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో యువకుడిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

comments