Home జాతీయ వార్తలు ఢిల్లీలో కాల్పులు

ఢిల్లీలో కాల్పులు

Man Shot Dead in Delhi

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. పొరుగింటి వారితో సోమవారం రాత్రి జరిగిన చిన్న ఘర్షణ కాల్పులకు దారి తీసింది. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. అతడి కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. కొడుకు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బాధితుల వివరాలు తెలియరాలేదు. నిందితులను అరెస్టు చేశామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Man Shot Dead in Delhi