Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

బిర్యానీ డబ్బులడిగితే.. ఓనర్‌ను కాల్చి చంపారు

murdr

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లోని ఓ హోటల్ లో దారుణం చోటుచేసుకుంది. కడుపునిండా బిర్యాని తిని చివరికి తిన్నదానికి బిల్లు చెల్లించమని అడిగినందుకు హోటల్ యాజమానిని అతి కిరాతంగా హతమార్చిన ఘటన తాజాగా వెలుగుచూసింది. నలుగురు కస్టమర్లుకు ప్లేట్‌కు రూ.190 చెల్లించాలని యాజమాని కోరడంతో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… బిర్యాని తిన్న తరువాత డబ్బులు కట్టమని హోటల్ ఓనర్ సంజయ్ మండల్ నలుగురు కస్టమర్లను కోరాడు. దీంతో కస్టమర్లు చెల్లించకపోవడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. తగదా కాస్త ముదరడంతో కోపోద్రిక్తుడైన ఒక కస్టమర్ తన వద్దనున్న తుపాకీతో సంజయ్‌పై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన బాధితుడిని దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటన 24 పరగణన జిల్లాలో చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బిర్యానీ ధరపై ఈ గొడవ జరిగిందా? లేదా మరే ఇతర కారణాల వల్ల నిందితుడు కాల్పులు జరిపాడా?  అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నిందుతులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, నలుగురిలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Comments

comments