Home జాతీయ వార్తలు ఎపి భవన్ సమీపంలో వ్యక్తి అనుమానాస్పద మృతి !

ఎపి భవన్ సమీపంలో వ్యక్తి అనుమానాస్పద మృతి !

Andhra Pradesh Bhavanన్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎపి భవన్ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. చక్రాల కుర్చీలో ఓ వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని ఎపి భవన్ సిబ్బంది సోమవారం తెల్లవారుజామున గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకొని పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని ఎపిలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. వ్యక్తి వద్ద ఒక లేఖ దొరికినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే చిన్న బాటిల్ తో పాటు రూ. 20 నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Man Suspicious Death at Andhra Pradesh Bhavan in Delhi