Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

అనుమానస్పద స్థితిలో వ్యక్తి దారుణ హత్య

man suspicious death in adilabad
సిరికొండ: సిరికొండ మండలంలోని సోన్‌పెల్లి శివారులో గురువారం రాత్రి మండలంలోని రాంజీగూడ గ్రామనికి చెందిన వ్యక్తి అర్కకమ్ము (48) అనుమానస్పాద స్థితిలో దారుణహత్యకు గురయ్యాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాంజీగూడ గ్రామనికి చెందిన అర్కకమ్ము గురువారం ఉదయం రాంజీగూడలోని ఇంటినుండి అదిలాబాద్‌కు పని నిమిత్తం వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి భయలుదేరాడు. రెండు రోజులు పాటు కుటుంబ సభ్యులకు ఎలాంటి సమచారం అందిచాలేదు. తిరిగి దేవ్‌రావుకు చరవాణి ద్వారా ఈ రోజు వస్తూన్నానని చెప్పాడు. అదిలాబాద్ నుండి తిరుగు ప్రయణంలో మండలంలో సొంపెల్లి గ్రామ శివారంలో దుండగులు ఇతనికి బండరాయితో కొట్టి చంపారు. ఈ శవన్ని సొంపెల్లి గ్రామస్థులు చూసి పోలీసులకు సమచారం అందిచారు. ఇతని చరవాణిని దుండగులు ఏత్తుకెళ్ళరాని, సంఘటన స్థలాన్ని సందర్శించిన ఉట్నూర్ డిఏస్పి వేంకటేష్ వెంటనే దుండగులను పట్టుకొని, కఠినంగా శిక్షిస్తామని, కాల్ డేటా ప్రకారం నిందితులను పట్టుకుంట్టమన్నారు. ఇప్పడే హత్యకు గల కారణాలు తెలియవని, మృతునికి భార్య ఒక కూతురు ఉంది. మృతదేహన్ని సొస్టూమార్టం నిమిత్తం భొథ్ ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నామన్నారు. ఘటన స్థలం వద్ద ఆయనతో పాటు ఇచ్చోడ సిఐ సతిష్‌కుమార్, సిరికొండ ఇన్స్‌చార్జ్ ఎసై రాముగౌడ్ నేరడిగొండ ఎసై వెంకన్న ఉన్నారు. దారుణ హత్యకు గురైన రాంజిగూడ గ్రామనికి చెందిన గిరిజన వ్యక్తి అర్క కమ్ము కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొవాలని, నిందితులను వెంటనే గుర్తించి, కఠినంగా శిక్షించాలని గిరిజన నాయకులు, తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేష్, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు జైకు డిమాండ్ చేశారు. వారు విలేకరులతో మాట్లాడుతూ ఈ హత్యకు అనేక అనుమానలు వ్యక్తమవుతున్నయాన్ని, ఈ హత్యకు గల కారణాలు వెంటనే గుర్తించి, నిందితులను శిక్షించాలని లేని పక్షంలో ఆందొళన చేపడతామని, వారి కుటుంబనికి ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు.

Comments

comments