Home తాజా వార్తలు వ్యక్తి అనుమానాస్పద మృతి

వ్యక్తి అనుమానాస్పద మృతి

Man Suspicious death in Hyderabad

హైదరాబాద్: ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని మృతి చెందిన సంఘటన నగరంలోని ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎపిలోని ఒంగోలుకు చెందిన మేకల కోటిరెడ్డి స్థానిక సద్గురు విలాస్ అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకుని చనిపోయాడు. కాగా, కోటిరెడ్డి ఆర్థిక లావాదేవిలా విషయమై రెండు రోజుల క్రితం ఎల్లారెడ్డిగూడలోని బంధువుల ఇంటికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే, బంధువులు మాత్రం ఆయన ఎందుకు చనిపోయాడో తెలియదని పోలీసులకు చెప్పారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.