Home దునియా చచ్చేంత ధైర్యం కావాల్సిందే!

చచ్చేంత ధైర్యం కావాల్సిందే!

 

Crocodile

ఈత కొట్టడమంటే ఎవరికైనా ఇష్టమే. కానీ మొసళ్లతో కలిసి ఈత అంటే.. ఎలా ఉంటుంది? ఆ అనుభవం పొందాలంటే ఆస్ట్రేలియాలోని డార్విన్ సిటీలో క్రోకోసారస్ కోవ్ అనే పార్క్ వెళ్లాల్సిందే. అక్కడ ఎంచక్కా నీళ్లలోకి దిగేసి 16 అడుగుల మొసళ్లతో కలిసి ఈతకొట్టవచ్చు. కాకపోతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పల్చటి ప్లాస్టిక్‌తో తయారుచేసిన ఆక్వాటిక్ ఎన్‌క్లోజర్‌లో కూర్చొని వాటిదగ్గరకు వెళ్లిపోవచ్చు. కవచ రక్షణ ఉంది కాబట్టి మీరు వాటిని దగ్గర్నుంచి చూసిన అనుభూతిని పొందుతారు. ఇంకా వాటి నోటిలో చేయి పెట్టొచ్చు…అవి చేసే చేష్టలను కూడా ఆస్వాదించవచ్చు. ఆ పార్కులోని మొసళ్లకు పేర్లు కూడా ఉన్నాయి. కాకపోతే అందులోకి దిగాలంటే మాత్రం కాస్తంత ఎక్కువ ధైర్యం కావాలండోయ్! పర్యాటకులు ఈ పార్కును చూడటానికి అమితాసక్తి కనబరుస్తున్నారు.

 

Man Swim with Crocodile in Australia