Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ఇంతకీ… హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేశావు బాసు…!!

14980788_330249827350327_4810143321416711485_n (1)

కుక్క ను ఎవ్వడైనా పెళ్లి చేసుకుంటాడా? కాని, ఈయన గారు మాత్రం దర్జాగా ఈ కుక్క గారిని పెళ్లి చేసుకున్నాడు.. ప్రపంచంలో అమ్మాయిలే లేరా ఏంది పెళ్లి చేసుకోవడానికి? అయినా… కుక్కను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలుసా?

ఇక్కడో తిరకాసు ఉంది, మతలబు ఉంది… ఏందంటే… ఆయనగారిని గత 15 ఏళ్లుగా ఏదో శాపం వెంటాడుతోందట. అందుకే పెళ్లి కూడా కావట్లేదట. ఏ పని చేసినా అడ్డుంకులు, ఓటములేనట. అందుకే ఎవరో జాతకం చెప్పే వారు ఇలా కుక్కను పెళ్లి చేసుకుంటే మిగితా జీవితం చాలా బాగుంటుందని, అన్ని దోషాలు తొలిగిపోతాయని… చెప్పారట.

ఇంకేం.. ఆలస్యం చేయకుండా మనోడు వెంటనే ఓ వీధి కుక్క మెడలో మూడు ముళ్లు వేసేశాడు. ఇక, ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలయి కూర్చుంది. ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరు కుక్కతో పెళ్లేందబ్బా.. అని ముక్కు మీద వేలేసుకుంటున్నారట.

అయితే, ఇటువంటి ఆచారాలు ప్రాచీన కాలం నుంచే భారతదేశంలో నడుస్తున్నాయి. అయితే, చాలా మంది దోషాలు తీరడానికి చెట్లను పెళ్లిచేసుకునేవారు. కాని, ఇలా కుక్కను పెళ్లి చేసుకోవడం మాత్రం ఎక్కడా చూడలేదు.. ఇదే ఫస్ట్ టైమ్. అంతే కదా…

Comments

comments