Search
Friday 16 November 2018
  • :
  • :

భార్యకు వైద్యం కోసం కూతురిని…

Man Tries to Sell Daughter for Pregnant Wife's Treatment

లక్నో: ఇదో హృదయవిదాకర సంఘటన. యుపిలోని కన్నౌజ్‌లో జరిగింది. భార్యకు వైద్యం చేయించడానికి డబ్బులు లేకపోవడం, ఎలాగైన ఆమె ప్రాణాలు కాపాడాలని కన్నకూతురినే అమ్మకానికి పెట్టాడో తండ్రి. విషయం పోలీసులకు తెలియడంతో అతడిని అడ్డుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కన్నౌజ్‌ నగరానికి చెందిన అరవింద్‌ బంజారా భార్య ఏడు నెలల గర్భిణి. అయితే, ఆమెకు ఉన్నట్టుండి తీవ్రంగా రక్తస్రావం అవుతుండటంతో జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చాడు. కాగా, తీవ్ర రక్తస్రావం కావడంతో భారీగా రక్తం పోయిందని, వెంటనే రక్తం ఎక్కించకపోతే ఆమె ప్రాణానికే ప్రమాదమని చెప్పారు వైద్యులు. కానీ, జేబులో చిల్లి గవ్వ కూడా లేని అరవింద్‌కు ఏం చేయాలో తోచలేదు. దీంతో వెంట వచ్చిన నాలుగేళ్ల కుమార్తెను రూ. 25 వేలకు అమ్మకానికి పెట్టాడు. విషయం కాస్తా పోలీసులకు తెలియడంతో వెంటనే అక్కడికి చేరుకుని ఈ దారుణాన్ని అడ్డుకున్నారు. అరవింద్‌ పరిస్థితిని తెలుసుకుని పోలీసులు అతడికి అవసరమైన ఆర్థిక సాయం చేశారు. అంతేగాక భవిష్యత్తులోనూ వైద్యఖర్చులన్నీ తామే భరిస్తామని హామీ ఇచ్చారు.

Comments

comments