Home ఆఫ్ బీట్ వీడియోలు ఐఫోన్ తో బీర్ బాటిల్ మూత తీయబోతే…!(వీడియో)

ఐఫోన్ తో బీర్ బాటిల్ మూత తీయబోతే…!(వీడియో)

iPhone As Openerవారమంతా కష్టపడి పనిచేసి అలసిపోయిన వారు వీకెండ్ లో తమ కష్టాన్ని మరిచిపోవడానికి చిన్నచిన్న సరదాలతో సేదతీరుతుంటారు. చాలా మంది మందు-విందులకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇక బ్యాచిలర్స్ అయితే బీర్లు పొంగాల్సిందే. బీరు బాటిల్ తేస్తే దాన్ని మూత తీయడానికి ఓపెనర్ ఉండాలి. ఒకవేళ లేకుంటే మాత్రం కొని తెచ్చుకోవడం బెటర్. ఎందుకంటే ఆ సమయంలో సమీపంలో ఓపెనర్ లేకుంటే మనం ఏవేవో ప్రయోగాలు చేసి దాన్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంటాం. తాజాగా జరిగిన ఓ సంఘటన అలాంటి ప్రయోగాలు ఎంత నష్టాన్ని మిగిలిస్తాయో తెలియజేస్తుంది. ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి బీర్లు కొట్టడానికి రెడీ అయ్యాడు. కానీ, వాటి మూతలు తీయడానికి సమీపంలో ఓపెనర్ లేకపోవడంతో మనోడు ఏకంగా ఖరీదైన ఐఫోన్ ను వాడాడు. మొదటి బాటిల్ మూత ఐఫోన్ తోనే తీశాడు. ఆ సమయంలో కొంచెం బెండ్ అయింది ఫోన్. అప్పుడైన మనోడు తెలుసుకోవాల్సింది.

కానీ, అతడు అదేమి పట్టిచుకోకుండా రెండో బాటిల్ ను కూడా అలాగే ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు. దాంతో అమాంతం ఫోన్ వెనుక భాగం మొత్తం వుడి వచ్చేసింది. దీంతో వంద రూపాయల బీర్ బాటిల్ కోసం వేల రూపాయల మొబైల్ పాడు చేసుకున్నట్లైంది. అతను అలా చేయడానికి కారణం లేకపోలేదు. అతగాడు ఇంతకుముందు యూ ట్యూబ్ లో ఐఫోన్ తో బీర్ బాటిల్ మూత ఓపెన్ చేయడం చూశాడు. అంతే… అచ్చం అలాగే ప్రయత్నించి ఇదిగో ఇలా చతికిలపడ్డాడు. అందుకే అనుకరణ అంతా మంచిది కాదంటారు పెద్దలు. ఎవరి టెక్నిక్స్ వారికి ఉంటాయి. మనం వాళ్లలాగే చేయాలని ట్రై చేస్తే.. ఇదిగో ఇలాగే ఉంటది. అదేదో పాత సామేత ఉంది కదా… ‘చారానా కోడికి బారానా మసాలా’ అన్నట్టుగా తయారైంది మనోడి పరిస్థితి. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కాని ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో మాత్రం సామాజిక మాధ్యమాల్లో తెగ హల్ చల్ చేస్తోంది.

Man Uses iPhone As Beer Bottle Opener