Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

హైదరాబాద్‌లో కొకైన్ విక్రేత అరెస్టు

Man was arrested for supplying banned cocaine to youth

మన తెలంగాణ/గోషామహల్ : ఉన్నత వర్గాలకు చెందిన యువతకు నిషేధిత కొకైన్‌ను సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసు లు అరెస్ట్ చేసి, అతని నుంచి హుందయ్ కారు, 2 మొబైల్  ఫోన్‌లు, రూ. 1.86 లక్షల విలువ చేసే కొకైన్, రూ. 7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సి వివేకానందరెడ్డి సంబంధిత వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ హ మీద్(38) గత కొంత కాలంగా నగరంలోని ఖైతరాబాద్‌లో రెహబెర్ పేరిట ట్రావెల్స్‌ను నిర్వహిస్తున్నాడు. ట్రావెల్స్ ద్వారా తరచుగా కస్టమర్లను నగరం నుంచి గోవాకు తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో అబ్దుల్ హమీద్‌కు గోవాలో మ్యాక్స్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మ్యాక్స్ అనే వ్యక్తి గోవా నుంచి కొకైన్‌ను నగరానికి తీసుకువచ్చి తనకు పరిచయం ఉన్న కస్టమర్లకు కొకైన్ వి క్రయించేవాడు.

కొకైన్‌ను పంపిణీ చేసేందుకు అబ్దుల్‌హమీద్‌ను ఏజెంట్‌గా నియమించాడు. అప్పటి నుంచి అబ్దుల్‌హమీద్ నగరంలోని కస్టమర్లను ఫోన్ ద్వారా సంప్రదించి, గ్రాము కొకైన్‌ను రూ. 6 వేలకు వికయించేవాడు. విశ్వసనీయ సమాచారంతో హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు ఆదివారం జరిపిన దాడుల్లో బంజారాహిల్స్ రోడ్ నెం. 36లో కొకైన్ సరఫరా చేస్తుండగా అబ్దుల్ హమీద్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, అతని నుంచి హుందయ్ కారు, రెండు సెల్‌ఫోన్లతో పాటు రూ.7 ల క్షల నగదు, రూ.1.86 లక్షల విలువ చేసే 31గ్రా ముల కొకైన్‌ను స్వాధీనం చేసుకుని నింధితుడిని తదుపరి విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్ ఎక్సైజ్ పోలీసులకు అ ప్పగించినట్లు హైదరాబాద్ డివిజన్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ వివేకానందరెడ్డి వెల్లడించారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూ పరింటెండెంట్ ఎన్ అంజిరెడ్డి ఆధ్వ ర్యంలో ఇన్‌స్పెక్టర్లు జె రవి, పి నరేందర్, ఎస్‌ఐ నసీముద్దీన్‌లతో పాటు హెడ్ కానిస్టేబుల్ అజీమ్, కానిస్టేబుళ్లు రాకేష్, శ్రీకాం త్, గోపాల్, కరణ్‌సింగ్, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.

Comments

comments