Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ఈనాటి దానకర్ణుడు!

Manoj-Munat

ప్రతి మనిషి ఉన్నదాంట్లో కొంతైనా దానం చేయాలి’ అని అంటుంటాం. స్వార్థపూరితంగా చేసే ఖర్చుల వల్ల వచ్చిన ఫలితం క్షణాల్లో మాయమవుతుంది. కానీ, సాటి మనిషికి సాయం చేస్తే అది ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి ఆలోచనే ఇప్పుడు మహారాష్ట్రకు చెందిన మనోజ్ మునాట్ అనే వ్యాపారవేత్తకు వచ్చింది. దాచిన డబ్బును విలాసాలకు ఖర్చు చేయడానికి మనసొప్పలేదు. ఆ డబ్బును పేదల కోసం ఉపయోగిస్తే వచ్చే సంతృప్తి గొప్పదిగా భావించారు. తన కూతురు పెళ్లికోసం ఖర్చు చేయాల్సిన డబ్బుతో నిరుపేదలకు ఇళ్లు కట్టించి, పలువురి నుంచి ప్రశంసలు పొందుతున్నారు మనోజ్ మునాట్.

తన కూతురు పెళ్లి నాడు ఒక్క రోజే లక్షల రూపాయలను ఖర్చు పెడితే ఏం బాగుంటుందని అనుకున్న మనోజ్ మునాట్‌కు ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. ఈ విషయం, తన కూతురు శ్రేయాస్‌కు చెప్పగా, ఆమె సరేనంది. దీంతో వివాహ ఉత్సవాలకు డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉండగా, దానికి బదులుగా, ఆ డబ్బుతో ఔరంగాబాద్‌లోని 90 నిరుపేద కుటుంబాలకు ఇళ్లు కట్టించి, వారికి బహుమతిగా ఇచ్చాడు. ఈ ఇళ్ల నిర్మాణానికి రూ.1.5 కోట్లు ఖర్చు అయ్యాయి.

ప్రస్తుతం, 40 కుటుంబాలు వారు కొత్త ఇళ్లల్లోకి వెళ్లిపోయారు. ఇంకా, మరిన్ని కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం పూర్తికానుందని, వారు కూడా త్వరలోనే వారి వారి ఇళ్లల్లోకి వెళ్లనున్నారని మనోజ్ మునాట్ తెలిపారు. “ఈ కొత్త ఇళ్లల్లోకి రాకముందు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాము, కరెంట్ సరఫరా, నీటి సరఫరా ఉండకపోయేది అని వాటిని పొందిన పేదలు చెప్పారు. అదేవిధంగా, నెల వారీగా ఇంటి కిరాయి చెల్లించడం చాలా భారంగా ఉండేదని” మనోజ్ మునాట్ ఇంట్లో పనిచేసే షాబ్ అలీ షైక్ అనే మహిళ చెప్పారు. పేదలకు చేసిన ఈ సహాయంతో తన కూతురు కళ్లల్లో సంతోషం కనిపించిందని, అది చాలు అని మనోజ్ మునాట్ పేర్కొన్నారు.

– మోత్కూర్ రవికుమార్

Comments

comments