Home పెద్దపల్లి ‘మన తెలంగాణ’ జర్నలిస్టు సత్యనారాయణ మృతి

‘మన తెలంగాణ’ జర్నలిస్టు సత్యనారాయణ మృతి

Journalist-Satish

మన తెలంగాణ/హైదరాబాద్: మన తెలంగాణ తెలుగు దినపత్రిక హైదరాబాద్ కార్యాలయంలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్న పోలంపల్లి సత్యనారాయణ అలియాస్ సతీష్(౩6) గురువారంనాడు మృతి చెందారు. మూడురోజుల క్రితం ఆయన భార్యాపిల్లలతో శుభకార్యానికి గోదావరిఖనికి వెళ్లి తిరిగి హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో ఖని బస్టాండ్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయనతో పాటు సతీమణి, ఇద్దరు కుమారులు కూడా గాయపడ్డారు.

సత్యనారాయణ మెదడుకు తీవ్రగాయాలతో పాటు, గుండెపోటు రావడంతో వెంటనే హైదరాబాద్‌లోని ఓమ్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స ఫలించక గురువారం సాయంత్రం ఆయన మృతి చెందారు. ఆయన మృతి పట్ల మన తెలంగాణ దినపత్రిక ఎడిటర్ కె. శ్రీనివాస రెడ్డి, మేనేజింగ్ ఎడిటర్ పి.అంజయ్య, డైరెక్టర్ శ్రీధర్‌రెడ్డితో పాటు ఉద్యో గులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సాను భూతి తెలియజేశారు. సత్యనారాయణ అంత్యక్రియలు శుక్రవారంనాడు ఆయన స్వగ్రామమైన పెద్దపల్లి జిల్లాలోని గర్రెపల్లిలో జరుగనున్నాయి.