Home ఆఫ్ బీట్ ప్రయాణికుల ఆనందమే ముఖ్యం

ప్రయాణికుల ఆనందమే ముఖ్యం

Pranab-Mukherjee

ప్రపంచంలో ఎక్కడికి వెళ్లాలన్నా ప్రణాళికలు వేసుకుంటాం.. ప్రయాణించే వాహనం గురించి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటాం. మంచి సదుపాయాలు కల్పించే ట్రావెల్స్ గురించి వాకబు చేస్తుంటాం. విలువలతో కూడిన ట్రావెల్స్‌ను నడిపిస్తూ..ప్రయాణికుల భద్రతకు మొదటి ప్రాధాన్యమిస్తూ…మధ్యతరగతివారికి కూడా అందుబాటులో ఉండేవిధంగా ప్యాకేజీలను ఏర్పాటు చేసి గత ఎనిమిదేళ్లుగా వరుసగా కేంద్ర ప్రభుత్వం నుంచి ది బెస్ట్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్ అవార్డును అందుకున్న సదరన్ ట్రావెల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.వి. ప్రవీణ్‌కుమార్‌తో మన తెలంగాణ ఇంటర్వూ…

ట్రావెల్స్ ఆలోచన ఎలా వచ్చింది?
మా నాన్నగారు శ్రీ ఆలపాటి వెంకటేశ్వర్రావు గారు సదరన్ ట్రావెల్స్ స్థాపకులు. 1958లో నాన్న గారు ఎం.ఏ., ఎకనామిక్స్. హిస్టరీ స్పెషలైజేషన్‌గా ఆగ్రాలో చదివారు. తర్వాత ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఐఎఎస్ పరీక్షరాసి పాసయ్యారు. కానీ ఇంటర్వూలో మిస్ అయ్యారు. దీంతో ఆయన నిరాశ చెందకుండా 1970లో సదరన్ ట్రావెల్స్ స్థాపించారు. అమ్మానాన్న ఇద్దరూ చాలా కష్టపడ్డారు. మాకు మార్కెటింగ్ విలువలు నేర్పించారు. మేం ముగ్గురం. ఇద్దరు అబ్బాయిలం, ఒక అమ్మాయి.
మా ట్రావెల్ ఏజెంట్లు ఇండియా మొత్తం మీద 200 మంది వరకు ఉన్నారు. ట్రావెల్స్ సిబ్బంది 600 మంది వరకు ఉన్నారు. తెలుగురాష్ట్రాల్లో విశాఖ, రాజమండ్రి, విజయవాడ, వరంగల్, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, లక్డీకపూల్‌లలో బ్రాంచిలున్నాయి. ఈ మధ్యనే విజయవాడ, వైజాగ్‌లలో రెండవ ఆఫీస్ ప్రారంభించాం. తమిళనాడులో చెన్నై, కోయంబత్తూర్, కర్ణాటకలో బెంగళూరు, కుమార్‌పార్క్, యశ్వంత్ పూర్‌లో ఉన్నాయి. హోటల్స్ ఢిల్లీలో హోటల్ సదరన్, విజయవాడలో హోటల్ సదరన్ గ్రాండ్, జైపూర్‌లో జోన్ బై ద పార్కు హోటళ్లు ఉన్నాయి.

ప్యాకేజీలు ఎలా ఉంటాయి?
ఉన్నత స్థాయి నుంచి మిడిల్ క్లాసు వాళ్ల వరకు అందుబాటు రేట్లలో టూర్ ప్యాకేజీలున్నాయి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. ఎకామ్‌డేషన్ రూంకు ఇద్దరు చొప్పున ఇస్తాం. ఇండియాలో ఏడాది పొడుగునా పర్యాటకులు పుణ్యక్షేత్రాలకు వెళ్తూనే ఉంటారు. అందుకనే మా సదరన్ ట్రావెల్స్ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. మే నెలలో టికెట్స్ ముందే బుక్ అయిపోతుంటాయి. పిల్లలకు వేసవి సెలవులు, ఇంట్లో అందరూ టూర్‌కు ప్లాన్ చేస్తుంటారు. రెండు రోజుల ప్యాకేజీ, ఏడు రోజుల ప్యాకేజీ, పదకొండురోజుల ప్యాకేజీ ..ఇలా రకరకాల ప్యాకేజీలు ఉన్నాయి. 4…,
3 హోటల్ వాళ్లతో బేరమాడి, మేం మా ప్రయాణికులకు తక్కువ ధరకే వసతి కల్పిస్తుంటాం. బ్యాంకుల నుంచి ఇఎమ్‌ఐల ద్వారా పర్యాటకులకు లోన్ సదుపాయం కల్పిస్తే బాగుంటుంది. దానికోసం మేం ప్రయత్నిస్తున్నాం.

విద్యార్థుల ప్యాకేజీలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
విద్యార్థులు మాత్రమే వెళ్లే ప్యాకేజెస్‌లో కొన్ని జాగ్రత్తలు పాటిస్తాం. ఈ ప్యాకేజీలో ధర కంటే క్వాలిటీ చూడాలి. రాత్రి ప్రయాణాలు ఎందుకు నసాగించరు మీరు?
మా టూర్స్‌లో నైట్ హాల్ట్ తప్పనిసరి. ఎందుకంటే ప్రయాణికుల ట్రావెల్ రక్షణ బాధ్యత పూర్తిగా మాది. ప్రయాణికులు, బస్సు నడిపే డ్రైవర్లు అలిసి పోయుంటారు. రాత్రుళ్లు మన ప్రమేయం లేకపోయినా ప్రమాదాలు జరగవచ్చు. పర్వతాలు, హైవేస్‌లో రాత్రి ప్రయాణాలు అంత మంచిది కాదు. కులూమనాలిగానీ, కశ్మీర్‌గానీ చాలా మంది నైట్ ట్రావెల్స్ చేస్తుంటారు. మేం మాత్రం ప్రిఫర్ చేయం.

Southern-Travels

విదేశీ టూర్‌లకు వెళ్లే పర్యాటకులు ఎక్కువగా కపుల్స్ ఉంటారా?
విదేశాలకు ఎక్కువగా జంటలు, కుటుంబాలు, గ్రూపులుగా వెళ్తుంటారు. మా ట్రావెల్స్ ఇక్కడ నుంచి గైడ్‌ను తీసుకెళ్తాం. టూర్ మేనేజర్ ఉంటారు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ మొత్తం కలిపి ఇండియన్ ఫుడ్ అందిస్తాం. మెజారిటీని బట్టి ఆహారం ఏర్పాటుచేస్తాం. ఎక్కువ మంది తెలుగు
వాళ్లుంటే తెలుగు ఆహారం, తమిళులంటే తమిళ ఆహారం. మేము పంపించే టూర్ మేనేజర్, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు. అంతేగాక, ఇమ్మిగేషన్ దగ్గర, వీసా పొందడానికి మా టూర్ మేనేజర్ సహాయం చేస్తారు. అవసరమైనచోట లోకల్ టూర్ గైడ్‌ను కూడా తీసుకుంటాము.

వేసవి సెలవుల్లో ట్రావెల్స్ బిజీగా ఉంటుందా?
ఎపుడు పిల్లలకు సెలవులు వచ్చినా ట్రావెల్స్‌లో రష్‌గా ఉంటుంది. సంక్రాంతి నుంచి కస్టమర్లు వస్తుంటారు. తర్వాత రెండు మూడు విజిట్లలో వెళ్లాల్సిన ప్రదేశాలని టికెట్లు బుక్ చేసుకుంటారు. ఎప్పుడు ఎటువంటి ప్రదేశాలకు వెళ్లాలో గైడ్ చేస్తుంటాం. సంవత్సరానికి ఒకసారి హాలిడే బజార్ ఏర్పాటు చేస్తాం. దాని ద్వారా ప్రయాణికులకు మా టూర్స్ గురించి మేము అందించే సదుపాయాల గురించి కూడా తెలియజేస్తాము.

హైదరాబాద్ సిటీ టూర్ గురించి తెలపండి?
1987 నుంచి హైదరాబాద్ సిటీ టూర్ నడుపుతున్నాం. సుమారుగా ఏడాదికి 40 వేల మంది మా ట్రావెల్స్ ద్వారా ప్రయాణిస్తుంటారు. లక్ష మంది వరకు మిగతా ప్రదేశాలకు ప్రయాణిస్తుంటారు. రామోజీ ఫిలింసిటీతో సహా అన్ని ప్రదేశాలను తక్కువ ధరకే పర్యాటకులకు చూపిస్తుంటాం. ఎసి, నాన్ ఎసి బస్సులు ఉంటాయి. సిటీ మొత్తం మీద చాలా చోట్ల పికప్ పాయింట్లు ఉన్నాయి.

వెళ్లిన ప్రదేశాల్లో సదుపాయాలు ఎలా ఉంటాయి?
దక్షిణ భారతదేశంలో కేరళ నెంబర్ వన్ టూరిస్ట్ డెస్టినేషన్. అక్కడ సదుపాయాలు బాగుంటాయి. ఉత్తర ఇండియాలో రాజస్తాన్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లు మంచి సదుపాయాలు అందిస్తున్నాయి. దక్షిణ ప్రాంతంలోని ప్రభుత్వాలతో పోలిస్తే…. ఉత్తర దేశంలోని రాష్టాల ప్రభుత్వాలు పర్యాటకులకు ఎక్కువ సదుపాయాలు, సాయం అందిస్తాయి.
అమర్‌నాథ్ యాత్రకు వెళ్లినపుడు ప్రతి 20 ఫీట్‌లకు ఒక సైనికుడు ఉంటాడు. యాత్ర ఉన్నంత వరకు లోకల్ పోలీస్, మిలటరీ వాళ్లు సెక్యూరిటీగా ఉంటారు.

డ్రైవర్లకు గైడెన్స్ ఇస్తుంటారా?
డ్రైవర్లకు తప్పనిసరిగా ట్రైయినింగ్ ఇస్తాం. ప్రాపర్ లైసెన్సు, పోలీస్ చెక్ ఉంటుంది. రాత్రి ప్రయాణాలు ఉండవు కాబట్టి మా బస్సుల్లో ఒక్కరే డ్రైవర్ ఉంటాడు. మాకు సొంత బస్సులున్నాయి. సీజన్ సమయంలో సరిపోవు. అప్పుడు మాత్రం అద్దెకు కూడా తీసుకుంటాం.
రాష్ట్రవిభజన ఎఫెక్ట్ సదరన్ ట్రావెల్స్‌పై పడిందా?
మా సంస్థకు రెండు రాష్ట్రాల్లో బ్రాంచీలు ఉన్నాయి. అందువల్ల మాకు ఎలాంటి ఎఫెక్ట్ లేదు.

రోడ్ ట్యాక్స్ పరిస్థితి ఎలా ఉంది?
రాష్ట్ర విభజన వలన రోడ్ టాక్సీలు పెరిగాయి. అదే భారం ప్రయాణికుడిపై పడుతుంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రోడ్ ట్యాక్స్ విధానం సరిగ్గా లేదు.

ప్రయాణికులకు మేమిచ్చే సూచనలు?
ఇండియా మొత్తంలో ఏ ప్రాంతానికి వెళ్లినా వ్యాపారస్తులు టూరిస్టులను హడావుడి పెట్టేస్తుంటారు. అందుకనే మేం మా ప్రయాణికులకు మీకు నచ్చితేనే కొనండి, బేరం చేయండి అని జాగ్రత్తలు చెబుతుంటాం.
పర్యాటకు అందించే సదుపాయాలు
నార్త్ ఇండియా టూర్ వెళ్లే వారికి ఢిల్లీలోని మా హోటల్‌లో క్లాక్ రూం సదుపాయం ఏర్పాటుచేశాం. అందుకని మా హోటల్‌లో ఉండే వారికి కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ పికప్, రైల్వేస్టేషన్ పికప్, డ్రాప్ సౌకర్యం కల్పిస్తున్నాం. మా ద్వారా ఉత్తరాన జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాంచల్, పంజాబ్, హర్యానా, యుపి, గయ మరియు రాజస్తాన్ వరకు వెళ్తుంటారు. నార్త్ ఈస్ట్‌లో సిక్కిం, మేఘాలయ, అస్సాం, భూటాన్ , అరుణాచల్‌లో కొత్త ప్రదేశాలను చూపిస్తాం.

– మల్లీశ్వరి వారణాసి