Home ఆదిలాబాద్ మొదటి విడతలో మంచిర్యాల జిల్లా

మొదటి విడతలో మంచిర్యాల జిల్లా

manchiriyalaప్రభుత్వం నూతన జిల్లాల ఏర్పాటు కోసం ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అధ్యక్షతన ఏర్పాటుచేసిన కమిటీ పని పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే మొదట విడతగా అయిదు నూతన జిల్లాల ఏర్పాటుకు కసరత్తు పూర్తిచేసి తన నివేది కను సమర్పించటానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, మహబూబ్‌నగర్ జిల్లాలో నాగర్‌కర్నూల్, నల్గొండ జిల్లాలో సూర్యాపేట, మెదక్‌లో సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్‌లను నూతన జిల్లా కేంద్రాలుగా ప్రతిపాదించినట్లుగా సమాచారం. మిగతా జిల్లాలైన నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలను రెండేళ్ల తరువాత విభజించాలని ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. ఈ అయిదు జిల్లాల నూతన కేంద్రాల ఏర్పాటులో మన మంచిర్యాల ఉండడంపట్ల ఇక్కడ ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఐదింటిలో మొదటి ప్రాధాన్యం
కొత్త జిల్లా ఏర్పాటుకు సర్వసన్నద్ధం
మంచిర్యాల జిల్లా ఏర్పాటుకు లైన్ క్లియర్
నివేదిక తయారు చేసిన జిల్లా ఉన్నతాధికారులు
సరిహద్దులు పంచాయతీల పంపిణీతో కూడిన నివేదిక

మనతెలంగాణ/మంచిర్యాల: తెలంగాణలో కొత్తజిల్లాల ఏర్పాటు ప్రక్రియకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో కొత్తగా ఏర్పడబోయే జిల్లాల వివరాలతో జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. పూర్తి వివరాలతో జిల్లా కలెక్టర్ ఎం. జగన్మోహన్ ఆదేశానుసారం ఏర్పడిన ప్రత్యేక అధికారుల బృందంతో కూడిన కమిటీ నివేదికను తయారు చేసినట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో ఈ నివేదికను జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనుంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం మొదటి దశలో ఐదు జిల్లాలను ఏర్పాటు చేసినందుకు నిర్ణయం తీసుకోగా ఆ ఐదింటిలో మంచిర్యాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తుండడంతో మంచిర్యాల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పంపిణీ జరిగిన తీరు ఇది….
జిల్లాలో మొత్తం 10 శాసన సభ నియోజకవ ర్గాలు ఉండగా 52 మండలాలున్నాయి. ఈ 52 మండ లాలలో 27,41.239 మంది జనాభా ఉన్నారు. ఆదిలా బాద్, బోథ్, నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజక వర్గాలలోని 26 మండలాలను ఆదిలాబాద్ జిల్లాలో, మం చిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గాలలోని 26 మండలాలను కొత్తగా ఏర్పడ బోయే మంచిర్యాల జిల్లాలో ఉంచాలని నివేదిక ద్వారా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించ నున్నట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లాలో ఐదు రెవెన్యూ డివిజన్లు ఉండగా ఆదిలాబాద్ 3, మంచిర్యాలలో 2 లేదా కొత్తగా బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేసి, చెరి మూడు చొప్పున పంపిణీ చేయనున్నారు. జిల్లాలో మొత్తం 866 గ్రామపంచాయతీలు ఉండగా ఆదిలాబాద్‌కు 478, కొత్త జిల్లాలకు 388, 52 జడ్‌పిటిసి స్థానాలలో 26 చొప్పున ఎంపిపి స్థానాలు, ఎంపిటిసి స్థానాలు 478, 388 చొప్పున కేటాయించేందుకు నివేదికలో సమాచారాన్ని పొందుపర్చారు.

సమస్య ఇది….!
నియోజకవర్గాల వారిగా మండలాల పంపిణీ జరుగుతున్న సమయంలో ఆసిఫాబాద్, ఖానాపూర్ నియోజకవర్గంలోని కొన్ని మండలాలను ఏ జిల్లాకు కేటా యిస్తే ఎలాంటి సమ స్యలు వస్తాయనే విషయంపై అధికారులు  పూర్తి వివరాలను నివేదిక ద్వారా పేర్కొన్నట్లు సమాచారం. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని నార్నూర్, జైనూర్ మండలాలు మంచిర్యాలకు కేటాయిస్తే కొత్త జిల్లా కేంద్రానికి కొంత దూరం  ఏర్పడడంతో పాటు ఖానా పూర్‌లోని కొన్ని మండలాలను కొత్త జిల్లాలోకి మారు స్తే అనుకూలతలపై నివేదికలో అధికారులు స్పష్టంగా అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇంతే కాకుండా కొత్త జిల్లా స్వరూపంపై  వనరులు, పారి శ్రామీకరణలను దృష్టిలో ఉంచుకొని, పక్క జిల్లాలోని  ప్రాంతాలను కలిపే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు ప్రచారం సాగుతుంది. ఏదేమైనప్పటికీ కొత్త జిల్లా ఏర్పాటు ప్రకియ విజయంలో రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేయడం  తూర్పు ప్రాంత ప్రజలను ఆనందంలో ముంచేత్తుతోంది.