Home తాజా వార్తలు హరికృష్ణ మృతిపట్ల మంచు మనోజ్ మీడియాకు వినతి

హరికృష్ణ మృతిపట్ల మంచు మనోజ్ మీడియాకు వినతి

Manchu Manoj request to Media don't telecast HariKrishna’s post accident visuals

హైదరాబాద్: నటుడు, టిడిపి నేత నందమూరి హరికృష్ణ నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి సమీపంలో బుధవారం తెల్లవారుజామన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. హరికృష్ణ అకాల మరణం పట్ల తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనకు సంతాపం తెలుపుతూ పలువురు సెలబ్రెటీలు ట్వీట్స్ చేశారు. మంచు వారాబ్బాయి హీరో మనోజ్ కుమార్ కూడా హరికృష్ణ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ మీడియాకు ఓ వినతి చేశాడు. హరికృష్ణ గారి మృతికి సంబంధించిన రోడ్డు ప్రమాద దృశ్యాలను ప్రసారం చేయవద్దని విన్నవించాడు. అలా ప్రసారం చేయడం వల్ల ఆయన కుటుంబీకులు, అనుచరులు, అభిమానులు మరింత కుంగిపోతున్నారని మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. హరికృష్ణ గారికి తగిన గౌరవాన్ని ఇవ్వాలని, తన అభ్యర్థనను మన్నిస్తారని ఆశిస్తున్నానంటూ మనోజ్ ట్వీట్ చేశాడు.