Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

కలెక్టరమ్మా… ఎన్నాళ్లీ వ్యథలమ్మా

Prajavani-programme

జిల్లాలు దగ్గర..అధికారులు దూరం
సమస్యలకు పరిష్కారం చూపని ప్రజావాణి
ఉదయం 11గంటలైన ప్రజావాణికి ఒక్క అధికారి హాజరైతే ఒట్టే
నెరవేరని కలెక్టర్ లక్ష్యం… నిర్లక్ష్యం నీడలో మండల అధికారులు

పెద్దమందడి: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను మండల స్థాయిలో పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతి సోమవారం తహసిల్దార్ అధ్యక్షతన ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో ప్రజలకు నిత్యం అవసరమైన రెవెన్యూ, మండల పరిషత్, ఎక్సైజ్ ,విద్య, వైద్యం, వ్యవసాయం, రోడ్లు, తాగునీరు, ఇందిరా క్రాంతి పథం, ఉపాధిహామీ వంటి 12 శాఖల అధికారులు ప్రజావాణికి హాజరై వారి సమస్యలపై ఇచ్చే వినతులను స్వీకరించాలని కలెక్టర్ మండల అధికారులను గట్టిగా ఆదేశించినప్పటికి అదికారుల పని తీరులో మార్పురావడం లేదు. సిఎం కెసిఆర్ పరిపాలన కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి అధికార యంత్రాంగాన్ని ప్రజలకు దగ్గర చేసినప్పటికి అధికారుల నిర్లక్ష్యం మాత్రం రోజు రోజుకు పెరిగిపోతుంది. సోమవారం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి ఉదయం 11గంటలు కావస్తున్న ఒక్కరు అంటే ఒక్క అధికారి కూడా ప్రజావాణికి హాజరు కాలేదు.

తహసిల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కోసం ఏర్పాటు చేసిన ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. సోమవారమైన అధికారులు అందుబాటులో ఉంటారని వివిధ గ్రామాల నుండి తహసిల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజల కు అధికారులు అందుబాటులో లేక వారి కోసం వేచి చూడాల్సి న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ప్రజలు గ్రామాల్లో మంచినీరు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. వైద్యమో రామచంద్ర అన్నట్లుగా వివిధ వ్యాధు ల బారిన పడి ప్రభుత్వ దావాఖానా చుట్టు తిరుగుతున్న వైద్య సిబ్బంది జాడ లేక పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుంది. ముఖ్యంగా రైతులు వ్యవసాయం,ఉపాధి హామీ , మండల అభివృద్దిలో భాగమైన వివిధ సంక్షేమ పథకాల కోసం కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారు. ప్రధాన శాఖలకు సంబందించిన అధికారులకు ఒక్కొక్కరికి నెలకు రూ. 60 నుండి 70 వేల దాకా నెల నెలా జీతాలు ,టిఎలు, డిఎలు, తీసుకుంటున్న ఒక్క రోజు సమయానుకూలంగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించకపోవడం పై ప్రజలు అధి కారుల పని తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంపిపి ,ఎంఎల్‌ఎ , జడ్పిటిసి చొరవ తీసుకుని అధికారుల పని తీరును, నిర్లక్షాన్ని చక్క దిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.

ప్రజావాణికి హాజరు కాని అధికారులపై కలెక్టర్‌కు నివేదిక ఇస్తాం…
తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి వారం నిర్వహిం చే ప్రజావాణికి వివిధ శాఖల అధికారులు గైర్హాజర్ అవుతూనే ఉన్నారని పలు మార్లు హెచ్చరించిన వారిలో మార్పు రావడం లేదని మండల డిప్యూటీ తహసీల్దార్ నాగరాజు తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నం 1.00 గంట వరకు ప్రజా వాణికి హాజరు కాని అధికారుల పై చర్యలు తీసుకునేందుకు కలెక్టర్‌కు నివేదిక పంపిస్తామని ఆయన తెలిపారు. వచ్చే ప్రజావాణిలో అధికారులకు సర్కులర్ జారీ చేస్తామన్నారు. నాగరాజు డిప్యూటీ తహసీల్దార్

Comments

comments