Search
Thursday 15 November 2018
  • :
  • :

మామిడి రైతులకు కోతుల బెడద

Monkey

కోరుట్ల రూరల్: మండల పరిధిలో సుమారు 50కి పైగా మామిటి తోటలు ఉన్నాయి. అందులో కొన్ని చెట్లకు అంతంత మాత్రమే కాయలు కాశయని మామిడి రైతులకు కోతుల బెడద పట్టుకుందని రైతులు వాపోతున్నారు. అసలే కరువుకాటుతో మామిడిరైతులు ఆందోళన చెందుతున్న క్రమంలో కోతుల బెడవ అధికమౌతుందంటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేక వానరులు వనం వీడి మామిడి తోటల్లోకి చేరి కాయలు కోస్తున్నాయంటు ఈ దశలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వెల్లడిస్తున్నారు. వడ గండ్ల వానలకు కాయలు రాలిన సంధర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇటీవల కాలంలో కోతుల హెచ్చుదల పెరిగిందని అవి మామిటి తోటలపై వందలాదిగా చేరి కాయలు కోస్తుంటే రైతుల భతుకులు అందకారణ్యంగా మారుతుందని వేదన పడుతున్నారు.

ఒక్క కోతిని చంపితే రెండు వందల కూలీ…

వానరుడి సక్షత్తు ఆంజనేయుడని ఎంతో దైవంతో పూజిస్తారు.గనుక వాటిని మామిటి తోటల్లోకి ప్రవేశించకు ండా జాగ్రత్తలు పాటించిన ప్రయోజనం శూన్యంగా మారడంతో చేసేది ఏమిలేక కోతులను చంపేందుకు కూలీను సిద్దం చేస్తున్నారు. ఒక్క కోతిని చంపితే రెండు వందల కూలీలను అందించి మట్టు బెట్టిస్తున్నారు. అయితే కొందరు మామిడి రైతులు కోతులను చంపకుండా అడివిలో ఒదిలేయాలని కూలీలకు సూచిస్తున్నారు. ఒక్క ఎకరానికి ఓ టన్ను మామిడి కాయలకు 14 వేల ఆదాయం వచ్చేక్రమంలో కోతులు తమ పాలిట శాపంగా మారి మామిడి రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయని వెల్లడిస్తున్నారు.

Comments

comments