Home నాగర్ కర్నూల్ తస్మాత్ జాగ్రత

తస్మాత్ జాగ్రత

రుచికరం ఆరోగ్యానికి హానికరం
రసాయనాలలో మామిడి కాయలను ముంచి పండ్లుగా మారుస్తున్న వైనం
తప్పని పరిస్థితుల్లో తింటున్న ప్రజలు
అమలుగాని కోర్టు ఆదేశాలు
పట్టించుకోని అధికారులు

Mango-Medicine

నాగర్‌కర్నూల్:  వేసవి వచ్చిందంటే చిన్నపిల్ల ల నుండి పెద్ద వారి వరకు ఇష్టంగా తినే పండు మామిడి పం డు. రుచితో పాటు ఆరోగ్యం ఇచ్చే ఈ ఫలాలను  విషపూరి తం చేసి మార్కెట్ లో అమ్మకాలు సాగిస్తున్నారు. మామిడి పండ్లే గాక ప్రతి పండు సహజ సిద్ధ్దంగా పక్వం అయ్యేలా చూడాలని  కాయలను  రసాయనాల  ద్వారా కృత్రిమ పద్దతి లో పండ్లుగా మార్చే పద్దతులను అవ లంబించే వారి పట్ల కఠి న చర్యలు తీసుకోవాలని స్వయంగా కోర్టు ఆదేశించినా ప్ర భుత్వ యంత్రాంగం మాత్రం పట్టించుకోవడం లేదు.  వ్యా పారులు  తమ దగ్గర వున్న మామిడి కాయలను త్వరగా ప ళ్ళుగా మార్చి  వాటిని అమ్మి సొమ్ము చేసుకునేందుకు ప్రయ త్నిస్తున్నారు.

ప్రజలు రోగాల భారిన పడితే తమకేం అన్నట్లు గా విషరసాయనాల ద్వారా మామిడి కాయలను పళ్ళుగా మారుస్తు న్నారు.కాగా సామాన్య వ్యాపారినుండి పెద్ద ఎత్తున హోల్ సెల్ వ్యాపారం చేసే  దళారుల వరకు ఈ దందా కొన సాగిస్తున్నా అధికారులు ఏమాత్రం కట్టడి చేయలేక పోతు న్నారనే  విమర్షలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో సాగు చేస్తున్న మామిడి పళ్లను రాష్ట్రంలోనే కాక విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోనే మా మిడి సాగులో నాగర్‌కర్నూల్ జిల్లా మొదటిస్థ్దానంలో ఉంది. దాదాపు 22వేల హెక్టార్లలో మామిడి తోటలు పెంచారు. ఏ టా జిల్లాలో దాదాపు ఆరవై వేల టన్నులకు పై బడి  దిగుబడి వస్తుందని అంచనా. జిల్లాలో మామిడి తోటలను  కొల్లాపూర్, కోడేర్, పెద్ద కొత్తపల్లి, లింగాల, అచ్చంపేటలో  ఎక్కువ విస్తీ ర్ణంలో సాగు చేస్తున్నారు.అధికారులు మామిడి తోటలు సాగు చేసే రైతులకు సాగుపట్ల అవగాహన కల్పిస్తున్నారే తప్ప వాటిని విష ర సాయనాలు ఉపయోగించి పళ్ళు గా మార్చే పద్దతులను అవలంబిం చకూడదని, వాటి ద్వారా కలిగే నష్టాల పట్ల అవగాహన కల్పించ డం లేదు.

మామిడి సాగు చేసే రైతు లు కాయలను దళారులకు అమ్మితే దళారులు వాటిని త్వరగా పళ్ళు గా మార్చడానికి కాల్షియం, కా ర్బోనేట్ వంటి రసాయనాల ద్వా రా పళ్ళు గా మారుస్తున్నారు. కాయలను అన్నింటిని గాలి చొర బడని ఒక రూంలో వేసి కాయల మద్యలో క్యాల్షియం కార్బోనేట్ రసాయనాలను చిన్న చిన్న పా కెట్లగా చేసి పెడతారు. కాయలు త్వరగా పండ్లుగా మారుతాయి . ఇటీవలి కాలంలో కాయలను త్వర గా మగ్గ పెట్టేందుకు ,ఓరకమైన కెమికల్‌ను నీళ్లలో కలిపి ఆనీటిలో మామిడి కాయలను ముంచుతు న్నారు. కొద్ది గంటల్లోనే చక్కటి రంగుతో ఆకర్షనీ యంగా పండ్లు తయారవుతున్నాయి. ఇవన్నీ జగ మెరిగిన సత్యమే అయినా ఫుడ్ ఇనిస్పెక్టర్‌గానీ ఇతర ఏ అధికారులుగాని పట్టించుకోవడంలేదు. జిల్లాలోని కొల్లాపూ ర్ మామిడి పండ్లకు దేశంలోనే మంచి గుర్తింపు ఉంది. ఆపేరును నిలబెట్టుకునేం దుకు సేంద్రీయ ఎరువుల వాడకం పురుగుల మం దులు తక్కువ మొతాదులో కొట్ట డంతో పాటు కా యను కోసేందుకు కూడా కొన్ని మెళకువలు పా టిస్తే మంచి ధర వస్తుందని ఇటీవల ప్రభుత్వ పరం గా రైతులకు శిక్షణ కూడా ఇచ్చారు. కొందరు రైతులు ఆలా చేయడం వల్ల ధరకూడా అధికంగానే లభించింది. అయితే పండిన పం టలో ఈ ప్రక్రియ అవలంభిస్తున్నది నామమాత్రమే. ప్రభుత్వం కాస్తా దృష్టిపెడితే ఇటు ప్రజలకు మంచి ఆరోగ్యకరమైన పండ్లు లభించడంతోపాటు రైతులకు కూడా ఆదా యం రెట్టింపు అవుతుందన్న భావన సర్వత్రా వ్యక్త మవుతుంది.

తప్పని పరిస్థితుల్లో :మార్కెట్ లో వేసవి వచ్చిందం టే మామిడి పండ్లు విపరీతంగా విక్రయిస్తారు. వాటిని చూసిన వెంటనే ఆతృతతో కొనుగోలు చేస్తారు. తీరా మామిడి పళ్ళను తినేటప్పుడు గాని తెలియదు . అవి రసాయనాల ద్వారా ప ళ్ళుగా మారుస్తారని సహజ సిద్దంగా చెట్ల నుం డి పళ్ళుగా అయిన మామిడి చాలా రుచిగా ఉంటుంది. రసాయనాల ద్వారా పళ్ళుగా మా ర్చినవి లోపల కచ్చిగా ఉండడమే గాక పుల్లగా ఉంటాయి. ఇది ఇలా ఉండగా మామాడి తోట ల రైతులు ఎక్కువ శాతం ప్రతి ఏటా గుత్తే దా రులకు ఇస్తుంటారు.

తోటలపై లక్షలు వెచ్చిం చి గుత్తాకు తీసుకున్న వారు ఎంత త్వరగా కా యలను పెంచుకోవాలి వాటిని ఎంత త్వరగా అమ్ముకొని సొమ్ము చేసుకోవాలన్న ఆలోచన లో ఉంటారు. దానికోసం అవసరానికి మించి న క్రిమి సంహారక మందులను చల్లుతున్నారు. ఇదేగాక వేసవిలో వచ్చే గాలి దుమారాలు, వరగళ్ల వానలతో కాయలు రాలి ఎంతో నష్టం వాటిల్లే పరిస్థితి ఉండ టంతో కాయ పక్వానికి రాకముందే తెంచి మార్కెట్‌కు తరలిస్తున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వ పరంగా సాయం అందించడం లేదా కోల్డు స్టోరేజీ సదు పాయం కల్పించ గల్గితే రైతులు గానీ గుత్తే దారులకు గానీ కలిగే నష్టం తగ్గే అవకాశం ఉంది ఆదిశగాకూడా ప్రభుత్వం అలోచించా ల్సిన అవసరం ఉంది.