Home సినిమా మణిరత్నంకు గుండెపోటు రాలేదు

మణిరత్నంకు గుండెపోటు రాలేదు

Mani-Rathanam

ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నం (63)కు గుండెపోటు వచ్చిందన్న వార్తల్లో నిజంలేదని ఆయన ప్రతినిధులు తెలిపారు. గురువారంమధ్యాహ్నం గుండెపోటు రావడంతో మణిరత్నంను నగరంలోని థౌజండ్ లైట్స్ ఏరియాలోని అపోలో అస్పతిలో చేర్చినట్లు వార్త్తలు వచ్చాయి. అయితే మణిరత్నం సాధారణ పరీక్షల్ల్లో భాగంగానే ఆస్పత్రికి వెళ్లినట్లు ఆయన ప్రతినిధులు తెలిపారు.తెలుగు, తమిళంలో ఆణిముత్యాల్లాంటి చిత్రాలను రూపొందించిన మణిరత్నం తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గీతాంజలి, రోజా, బొంబాయి, నాయకుడుతో పాటు పలు విజయవంతమైన చిత్రాలను ఆయన తెరకెక్కించారు. ప్రముఖ నటి సుహాసినిని ఆయన వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం తమిళంలో ‘చెక్క చీవంత వాణం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తెలగులో ‘నవాబ్’ అనే టైటిల్‌తో విడుదల కానుంది. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, సింబు, అదితిరావ్ హైదరి ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.