Home నల్లగొండ ప్రేమోన్మాది హత్యాయత్నం

ప్రేమోన్మాది హత్యాయత్నం

Murder-Attempt

చండూరు : ప్రేమించకుంటే పెట్రోలు పోసి నిప్పంటిస్తానని ఒక ప్రేమోన్మాది హత్యాయత్నం చేసిన సంఘటన చండూరు మం డలం పుల్లెంల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జాజుల రవి (26) అదె గ్రామానికి చెందిన నకిరెకంటి రేణుక (20) ను తనను ప్రేమించాలంటూ పలు పర్యాయాలు ఒత్తిడి తెచ్చాడు. చివరికి సోమ వారం సాయంత్రం రేణుక ఇంట్లోకి ప్రవే శించి తనను ప్రేమించకుంటే పెట్రోలు పోసి చంపే స్తానని  బాటిల్ తీయగా కేకలు వేయ డంతో గ్రామస్తులు వెంటనె ఇంట్లోకి చేరుకొని సమస్యను పోలీసు స్టేషన్‌లో తండ్రి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు నిందితున్ని అదుపు లోకి తీసు కొని అత్యాచారయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు.