Search
Thursday 15 November 2018
  • :
  • :

ఒక్క రోజులో 40 లక్షల వ్యూస్…(వీడియో)

Heroine

చెన్నై: తమిళంలో తెరకెక్కుతున్న ‘ఒరు అదర్ లవ్‌’ అనే చిత్రంలోని  ‘మాణిక్య మలరయ పూవి’ అనే పాట సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్ లో సెన్సెషన్ సృష్టిస్తోంది. కేవలం ఒక్కరోజులోనే ఈ పాటను 40 లక్షల మందికి పైగా వీక్షించారు. ప్రేమికుల రోజు కానుకగా విడుదల చేసిన ఈ పాట యువతను బాగా ఆకట్టుకుంటుంది. పాట మొత్తంలో ఓ అందమైన అమ్మాయి.. తన ప్రియుడిని చూస్తూ కన్నుకొడుతున్న సన్నివేశం సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ అమ్మడు తన చూపులతోనే నెటిజన్లను ఫిదా చేస్తోంది. ‘ఒరు అదర్ లవ్‌’ మూవీలో ఓ కథనాయికగా నటిస్తున్న ఆ అమ్మడు పేరు  ప్రియ ప్రకాశ్‌ వారియర్‌. ఆదివారం విడుదలైన ఈ పాట కేవలం 24 గంటల్లోనే 40 లక్షలకు పైగా  వ్యూస్ సాధించడం విశేషం.

Comments

comments