Home వార్తలు కార్తితో మణిరత్నం చిత్రం

కార్తితో మణిరత్నం చిత్రం

karthiభారతీయ సినిమా రంగంలో ఐకానిక్ ఫిల్మ్ డైరెక్టర్‌గా పేరుతెచ్చు కున్నాడు మణిరత్నం. కంటెంట్ బేస్డ్ సిని మాలను తీస్తూ ఆయన ప్రేక్షకులను ఎంతగా నో అలరిస్తున్నాడు. తాజాగా మణిరత్నం… కార్తి, సాయి పల్లవి జంటగా ఓ చిత్రాన్ని తెరకెక్కించేం దుకు ప్లాన్ చేస్తున్నాడు. ‘ఊపిరి’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న కార్తి ఈ డిఫరెంట్ మూవీలో నటించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూ స్తున్నాడు. ముందుగా ఈ సినిమాను జూన్‌లో సెట్స్‌పైకి తీసుకువెళ్లాలని అనుకు న్నా చివరికి ఈ చిత్రం సెప్టెంబర్‌కు వాయిదాపడింది. కాశ్మీర్‌లో ఈ చిత్రాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేశారు. ఆల్‌టైమ్ గ్రేట్ హిట్ ‘రోజా’ తర్వాత మరోసారి కాశ్మీర్‌లో తన సినిమాను రూపొందించ బోతున్నాడు మణిరత్నం. కాశ్మీర్ బార్డర్ టెర్రరిజమ్‌పై ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. సినిమాలో కార్తి ఎయిర్ పైలట్‌గా నటించనుండగా ‘ప్రేమమ్’ ఫేమ్ సాయి పల్లవి డాక్టర్‌గా చేయనుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించను న్నాడు.   సినిమాటోగ్రాఫర్‌గా రవివర్మ పనిచేసే ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ను నిర్ణయించలేదు.