Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

రామ్‌చరణ్‌తో మణిరత్నం మూవీ?

maniratnamరామ్‌చరణ్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో సినిమా తెరకెక్కబోతోందన్న విషయం ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. ఆమధ్య మణిరత్నం తన భార్య సుహాసినితో కలిసి హైదరాబాద్‌కు వచ్చి చిరు ఇంట్లో కథా చర్చలు సాగించినట్టు వార్తలొచ్చాయి. అది రామ్‌చరణ్ సినిమా కోసమేనట. అయితే ఏమైందే ఏమో కానీ ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం కార్తీతో ఓ సినిమా చేస్తున్నాడు మణి. ఓ పైలట్ ప్రేమకథతో తెరకెక్కుతున్న సినిమా ఇది. శరవేగంగా షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం. అయితే ఇదివరకటిలాగా కాకుండా మణిరత్నం ఓ సినిమా సెట్స్‌పై ఉండగానో నెక్స్ మూవీ గురించి చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఇటీవల రామ్‌చరణ్‌కు… మణిరత్నం స్టోరీ లైన్ వినిపించినట్టు సమాచారం. మణిరత్నంతో సినిమా చేయడానికి చరణ్ ఎంతో ఉత్సాహంగా ఉన్నాడట.

Comments

comments