Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

మనీషా కొయిరాలా సెకండ్ ఇన్నింగ్స్

Manisha-Koiralaబాంబే, క్రిమినల్, భారతీయుడులాంటి హిట్ సినిమాలతో ప్రేక్షకులను మైమరపించిన అందాల తార మనీషా కొయిరాలా. 90 దశకంలో తన అందచందాలు, గ్లామరస్ నటనతో యూత్‌ను అలరించింది ఈ భామ. వివాహం తర్వాత ఆమె కొంతకాలం సినిమాలకు గ్యాప్‌నిచ్చినిచ్చింది. తాజాగా మనీషా కొయిరాలా తమిళ చిత్రం ‘ఒరు మెల్లియ కొడు’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తోంది. అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో మరో లీడ్ రోల్ చేస్తున్న శ్యామ్‌కు జంటగా మనీషా నటిస్తోంది.

ప్రస్తుతం జెట్ స్పీడ్‌తో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ సినిమాతో ఘనంగా తన పునరాగమనాన్ని చాటాలని మనీషా కోరుకుంటోంది. ఇదిలా ఉందగా ఈ నెల మూడో వారంలో ఆమె యుఎస్‌లోని మన్‌హట్టన్‌కు వెళ్తోంది. మనీషా అక్కడ నేపాలీలు, ఎన్‌ఆర్‌ఐలను కలిసి నేపాల్ భూకంప బాధితులకు సాయాన్ని అర్థించనుంది.

Comments

comments