Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

నారా భువనేశ్వరిగా మంజిమ?

manjeema Act In NTr Biopic Movie

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కీలక పాత్రల కోసం క్రిష్ టాలీవుడ్, బాలీవుడ్‌లోని ప్రముఖ నటులను ఏరి కోరి ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మరో కీలక పాత్ర అయిన నారా చంద్రబాబు నాయుడు  సతీమణి భువనేశ్వరి పాత్రలో ఎవరు నటించబోతున్నారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ పాత్రలో మలయాళ నటి మంజిమా మోహన్ నటించబోతున్నట్లు తెలిసింది. ఆమె ఎంపిక దాదాపు ఫైనల్ అయిందట. టాలీవుడ్‌లో బయోపిక్‌లకు ‘మహానటి’ ఓ బెంచ్‌మార్క్ సెట్ చేయడంతో ‘ఎన్టీఆర్’ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు క్రిష్. బాలకృష్ణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో స్వయంగా నిర్మిస్తున్నాడు. నారా భువనేశ్వరి పాత్రకు ఎంపికైన మంజిమా మోహన్ గతంలో ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో నటించింది. ఇక లక్ష్మీపార్వతి పాత్రలో ఆమని నటించబోతున్నట్లు పుకార్లు వస్తున్నాయి.

Comments

comments