Search
Wednesday 21 November 2018
  • :
  • :

ఆర్థిక దుశ్చర్యకు ఇదే పెద్ద నిదర్శనం

Manmohan criticized the abolition of large notes in country

దేశంలో పెద్ద నోట్ల రద్దు దౌర్భాగ్యపు, అనాలోచిత నిర్ణయం , ఆర్థిక దుస్సాహసం అని మాజీ ప్రధాని మన్మో హన్ సింగ్ వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థకు గాయంగా మారి నేటికి రెండేళ్లు అయిందని, కాలం గడుస్తున్న కొద్దీ ఈ దుష్ప్రభావం తీవ్రతరం అవుతోందని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై, సమాజంపై ఇది పిడుగుపాటు అయిందని , ఈ ఫలితం ప్రభావం ఇప్పుడు కన్పిస్తోందని విశ్లేషించారు. ఇటువంటి అరాచక , స్వల్పకాలిక ఆర్థిక చర్యలకు పాల్ప డటం మానుకోవాలి, లేకపోతే దేవ ఆర్థిక వ్యవస్థకు మరింత చేటు ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం అనాలోచితంగా, మూర్ఖంగా ఆర్థిక దుస్సాహానికి దిగిందని , ఇటువంటి నిర్ణయం దేశానికి ఎంతటి ముప్పు తెస్తుందో గుర్తు చేసుకునే రోజు ఇదని, ఈ నష్టం ప్రభావం ఇప్పటితో పొయ్యేది కాదని, దీర్ఘకాలిక నష్టం ఉంటుందని హెచ్చరించారు.

ఇప్పటికైనా ఎవరైనా ఎటు వంటి ఆర్థిక నిర్ణయాలు అయినా స్పష్టతతో అంతకు మించి సముచిత ఆర్థిక దూరదృష్టితో తీసుకోవల్సి ఉంటుందని, దీనిని గ్రహించాల్సిన అవసరాన్ని ఈ పెద్ద నోట్ల రద్దు రోజున అంతా గుర్తుంచుకోవాలని మాజీ ప్రధాని తేల్చిచెప్పారు. నోట్‌బందీ దేశంలోని ప్రతి వ్యక్తిని దెబ్బతీసిందని, కుల, మత లింగ తెగ, వృత్తి తేడాలు లేకుండా సగటు వ్యక్తులందరినీ దెబ్బతీసిందని విమర్శించారు. సాధారణంగా కాలం గడిచే కొద్దీ గాయాలు మానిపోతాయంటారు అయితే దురదృష్టవ శాత్తూ గుడ్డిగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మిగిల్చిన గాయాలు , దేశ ఆర్థిక వ్యవస్థకు పడ్డ మర కలు రోజులు గడుస్తున్న కొద్దీ మరింతగా బాధి స్తున్నాయని, స్పష్టంగా కన్పిస్తున్నాయని ఈ ఆర్థిక వేత్త తేల్చిచెప్పారు.

Manmohan criticized the abolition of large notes in country

Telangana Latest News

Comments

comments