Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

మధ్య మానేరు ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేయాలి

Untitled-1.jpg5ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్

సిరిసిల్ల: మధ్య మానేరు ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేసి 2017వ సంవత్సరం కల్లా పూర్తి చేయాలని అధికారులను ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ సోమవారం సాయంత్రం ఆదేశించారు.
సిరిసిల్ల – వేములవాడ – చొప్పదండి – మానకొండూరు నియోజకవ ర్గాలకు తాగునీటిని అందించేందుకు నిర్మిస్తున్న మిషన్ భగీరథ పైప్‌లైన్, రిజర్వాయర్ల పనులను మంత్రి ఈటెల రాజేందర్, శాసనసభ్యులు బొడిగె శోభ, జిల్లా కలెక్టర్ నీతూ కుమారి తదితరులతో కలిసి పరిశీలించారు. అనంతరం సిరిసిల్లలో రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వర నీటి పథకాన్ని 2017 కల్లా పూర్తి చేయాలనే లక్షంతో ప్రభుత్వం పనిచేస్తుందని మధ్యమానేరు ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేసి 3 టిఎంసి ల నీటిని నిలువ చేసి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు, ఇతర జిల్లాలకు అందించాలని కృషి చేస్తున్నామన్నారు. ఎగువ మానేరు ప్రాజెక్ట్‌కు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని పంపిస్తామన్నారు. మెట్ట భూములను సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్షమన్నారు.
సిరిసిల్లను ఇతర జిల్లాల్లో కలుపుతారనే ప్రచారంలో నిజం లేదు ః మంత్రి ఈటెల రాజేందర్
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న జిల్లాల్లో భాగంగా సిరిసిల్ల ప్రాంతాన్ని సిద్దిపేట లేదా కామారెడ్డి జిల్లాల్లో కలుపుతారనే ప్రచారంలో నిజం లేదని కరీంనగర్‌లో కొనసాగించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తుందని పూర్తిస్థాయిలో కొత్తజిల్లాల ప్రతిపాదనలు అయిన తర్వాత వివరాలు తెలుస్తాయన్నారు.

Comments

comments