Home స్కోర్ హాకీ కెప్టెన్‌గా మన్‌ప్రీత్ సింగ్

హాకీ కెప్టెన్‌గా మన్‌ప్రీత్ సింగ్

Hockeyన్యూఢిల్లీ: భారత హాకీ జట్టు కెప్టెన్‌గా మిడ్‌ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్‌ను నియమించారు. కెప్టెన్ శ్రీజేష్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో అతని స్థానంలో మన్‌ప్రీత్‌కు సారధ్య బాధ్యతలు అప్పగించారు. జర్మనీలో జరిగే మూడు దేశాల హాకీ టోర్నమెంట్‌తో పాటు ప్రపంచ హాకీ లీగ్ సెమీఫైనల్‌లో మన్‌ప్రీత్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. మూడు దేశాల టోర్నీ కోసం గురువారం భారత హాకీ జట్టును ప్రకటించారు. జూన్ ఒకటి నుంచి జర్మనీలో జరిగే మూడు దేశాల హాకీ టోర్నమెంట్‌లో భారత్ పాల్గొంటుంది. ఇందులో జర్మనీ, భారత్, బెల్జియం జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీ ముగిసిన తర్వాత భారత్ ఇంగ్లండ్‌లో జరిగే హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్ పోటీల్లో పాలుపంచుకుంటుంది. ఇందులో భారత్‌కు పూల్-బిలో చోటు దక్కింది. ఇందులో భారత్, పాకిస్థాన్, నెదర్లాం డ్స్, స్కాట్లాండ్, కెనడా జట్లు ఉన్నాయి. కాగా, భారత జట్టు వైస్ కెప్టెన్‌గా చింగ్లెసనా సింగ్‌ను నియమించారు. కాగా, భారత జట్టుకు పెనాల్టీ కార్నర్ నిపుణుడు రూపిందర్‌పా ల్ సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలు వనున్నాడు. హర్మన్‌ప్రీత్ సింగ్ కూడా పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్ గా ఎంపికయ్యాడు.
జట్టు వివరాలు
గోల్ కీపర్లు: ఆకాష్ చిక్టె, వికాస్ దహి యా ప్రదీప్ మోర్, కొతజీత్ సింగ్ సురేందర్ కుమార్, రూపిందర్ పాల్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్.
మిడ్‌ఫీల్డర్స్: మన్‌ప్రీత్ సింగ్(కెప్టెన్), చింగ్లె సనా సింగ్ (వైస్ కెప్టెన్), ఎస్.కె.ఉతప్ప, సత్‌బీర్ సింగ్, సర్దార్ సింగ్, హర్జిత్ సింగ్.
ఫార్వర్డ్: రమన్‌దీప్ సింగ్, ఎస్.వి.సునీల్, తల్విందర్ సింగ్, మన్‌దీప్ సింగ్, ఆకాష్‌దీప్ సింగ్.