Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఐదు నెలల కనిష్ఠానికి తయారీ రంగం

bsns

మార్చిలో 51కు క్షీణించిన పిఎంఐ

న్యూఢిల్లీ: వరుసగా ఎనిమిదో నెల తయారీ రంగం పిఎంఐ సానుకూలంగా ఉండగా.. మార్చిలో మాత్రం  ఐదు నెలల కనిష్టానికి పతనమైంది. నిక్కీ ఇండియా ఉత్పత్తి రంగం పిఎంఐ(పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్) ఫిబ్రవరి నెలలో 52.1గా ఉండగా.. ఇది మార్చి నెలలో 51.0కు పడిపోయింది. దాదాపు ఐదు నెలల కనిష్టానికి క్షీణించింది. ఇండెక్స్ 50కి పైన ఉండే వృద్ధిని, అలాగే దిగువన ఉంటే విరుద్ధంగా ఉందని సూచిస్తుంది. సర్వే ప్రకారం, గత అక్టోబర్ నుంచి నిర్వహణ పరిస్థితుల్లో నెమ్మదిగా పురోగతి కనిపిస్తోందని నిక్కీ తన నివేదిక పేర్కొంది. అదే సమయంలో ఉత్పత్తి, కొత్త ఆర్డర్లు మార్చి నెలలో నెమ్మదిగా పెరుగుతూ వస్తున్నాయి. ఎనిమిది నెలల్లో తొలిసారిగా ఉపాధి సృష్టి మందగించింది. ఈ వారంలో ఆర్‌బిఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్వహించనుంది. దీనికి రెండు రోజుల ముందు నిక్కీ ఈ నివేదిక వెలువరించడం.. ఇది ఆర్‌బిఐ సమీక్షకు దోహదం చేయనుంది. వినిమయ వ్యయాల్లో పురోగతి నెమ్మదిగా ఉండడంతో.. 201718 ఆర్థిక సంవత్సరంలో ఐహెచ్‌ఎస్ మార్కిట్ వాస్తవ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) అంచనాను  7.3 శాతంగా అంచనా వేసింది. ఈమేరకు ఐహెచ్‌ఎస్ మార్కిట్ ఆర్థికవేత్త ఆశ్నా డోధియా తెలిపారు. కాగా ఏప్రిల్‌లో ఆర్‌బిఐ సమీక్షలో వడ్డీ రేట్ల విషయంలో తటస్థ వైఖరిని అవలంభించే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్‌బిఐ వడ్డీ రేటును 6 శాతం, రివర్స్ రెపో రేటు 5.75 శాతాన్నే యథాతథంగా కొనసాగించనుందని అంటున్నారు. ఏప్రిల్ 45 తేదీల్లో ఆర్‌బిఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరుగనుంది. ఆర్‌బిఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ అధ్యక్షతన ఎంపిసి(మానిటరీ పాలసీ కమిటీ) రెండు రోజులపాటు సమావేశంకానుంది. గురువారం మధ్యాహ్నం ద్వైమాసిక పాలసీ నిర్ణయాలు వెలువడనున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం, ముడిచమురు ధరలు, కరెంట్ ఖాతా లోటు, రుతుపవన అంచనాలు వంటి పలు అంశాలు ఆర్‌బిఐ సమీక్ష నిర్ణయాల్లో కీలకం కానున్నాయి.

Comments

comments