Home తాజా వార్తలు మ‌న‌సులోమాట బ‌య‌ట‌పెట్టిన విశ్వసుందరి

మ‌న‌సులోమాట బ‌య‌ట‌పెట్టిన విశ్వసుందరి

ms-world

భార‌తీయ మ‌హిళ‌లు చాలా మంది విశ్వ సుంద‌రులుగా నిలిచిన సినిమాల‌లో  సత్తా చాటి స్టార్ స్టేట‌స్ అందుకున్నవిషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే ఖాతాలోకి మిస్ వ‌ర‌ల్ట్ మానుషీ చిల్ల‌ర్ చేరింది. త‌న త‌దుప‌రి ల‌క్ష్యం సినిమాలే అంటూ స్ప‌ష్టం చేసింది. అది కూడా బాలీవుడ్ న‌టుడు అమీర్ ఖాన్‌తో న‌టించాల‌ని ఉంద‌ని ఈ అమ్మ‌డు చెప్ప‌డం విశేషం. అమీర్ సిన్మాలు ఎంట‌ర్‌టైనింగ్‌తో పాటు సందేశాత్మ‌కంగా ఉండ‌డం వ‌ల‌న అమీర్‌తో క‌లిసి ఓ సినిమా త‌ప్ప‌క చేస్తాన‌ని మానుషి చెబుతుంది. ఇక హీరోయిన్స్‌లో గ్లోబ‌ల్ గార్ల్ ప్రియాంక చోప్రా భాగ ఇష్ట‌మ‌ట‌. తాజాగా ఈ అమ్మ‌డు ఓ ప‌త్రిక క‌వ‌ర్ పేజ్ కోసం ఫోటో షూట్‌లో పాల్గొంది. ఇందుకోసం హాట్ స్టిల్స్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఇవి సోష‌ల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.