గోరు వెచ్చటి నిమ్మ రసాన్ని పొద్దున్నే తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. కాఫీ, టీలకు బదులు నిమ్మరసం తీసుకోవడం ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల గ్యాస్ట్రో సిస్టం మెరుగు పడుతుంది. శరీరంలో న్యూట్రిషన్లు, ఇతర మినరల్స్ గ్రహించే శక్తి పెరుగుతుంది. దీంతో పలు వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. నిమ్మలో ఉండే అల్కలైన్ లక్షణాలు శరీరంలోని మాలిన్యాలను తొలగించడంలో అమోఘంగా పనిచేస్తాయి.
నిమ్మ అసిడిక్‌గా అనిపించినప్పటికీ దీంట్లోని మంచి గుణాలు శరీరంలో పీహెచ్ విలువలను సమతుల్యం చేయడంలో చాలా ఉపయోగపడతాయి. నిమ్మకాయలో ఉండే పెక్టిన్ అనే ప్రత్యేక ఫైబర్ పదార్థం వల్ల బరువు తగ్గాలనునుకునే వారికి ఇది ఒక దివ్య ఔషదం. దీంతో మెటబాలిజం రేటు మెరుగుపడుతుంది. మసాలాలు, జంక్‌ఫుడ్ లాంటివి తిన్నప్పుడు అసిడిటీ లాంటి సమస్యలు తలెత్తుతాయి వీటి నుంచి విముక్తికి నిమ్మరసం తాగడం ఉత్తమం.